Andhra Pradesh: జగన్ సర్కారుకు టీచర్లు షాక్.. జీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళనలు

ABN , First Publish Date - 2023-09-25T16:29:00+05:30 IST

జీపీఎస్ విధానాన్ని నిరసిస్తూ ఏపీలో టీచర్లు ఆందోళన బాట పట్టారు. అన్ని ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్లు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.

Andhra Pradesh: జగన్ సర్కారుకు టీచర్లు షాక్.. జీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళనలు

జీపీఎస్ విధానాన్ని నిరసిస్తూ ఏపీలో టీచర్లు ఆందోళన బాట పట్టారు. అన్ని ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్లు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. జీపీఎస్ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానమే అమలవుతోందని.. ఏపీలో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ‘ఉద్యోగులకు ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం జీపీఎస్‌’, ‘ఈ మోసపూరిత జీపీఎస్‌ మాకొద్దు’, ‘మాట తప్పవద్దు.. మడమ తిప్పవద్దు’, ‘దగాకోరు జీపీఎస్‌, దగుల్బాజీ జీపీఎస్‌’, ‘మా సొమ్ము కాజేసే జీపీఎస్‌’ అంటూ పలు చోట్ల ఉపాధ్యాయ సంఘాలు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి: YSRCP: బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. ఆడియో వైరల్

కాగా సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం పునరుద్ధరిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారని.. ఇప్పుడు జీపీఎస్‌ పేరిట గోల్‌మాల్‌ పింఛను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు మండిపడ్డారు. సీపీఎస్ రద్దుపై ఇప్పటివరకు నాన్చుడు ధోరణి అవలంభించి.. ఇప్పుడు సీపీఎస్ కంటే దుర్మార్గమైన జీపీఎస్‌ను అమలు చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఉద్యోగుల నుంచి కట్ చేసిన 10 శాతం డబ్బులను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని.. కానీ జీపీఎస్ విధానంలో టీచర్ల 10 శాతం డబ్బులను ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన పనిలేదన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గరే ఉంచుకుని వాడుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు ఆలోచనతోనే జగన్ ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. కాగా కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌), గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను రద్దు చేసి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని, లేని పక్షంలో జగన్ ప్రభుత్వం తమ తప్పు ఒప్పుకుని గద్దె దిగాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.

ap teachers -1.jpg

Updated Date - 2023-09-25T16:31:34+05:30 IST