Adilabad: చివరి నిమిషంలో హరీశ్‌రావు పర్యటన రద్దు..వ్యతిరేక వర్గం ఒత్తిడి వల్లే టూర్‌ రద్దని ప్రచారం..!

ABN , First Publish Date - 2023-02-27T12:40:40+05:30 IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. షెడ్యూల్ ప్రకారం..

Adilabad: చివరి నిమిషంలో హరీశ్‌రావు పర్యటన రద్దు..వ్యతిరేక వర్గం ఒత్తిడి వల్లే టూర్‌ రద్దని ప్రచారం..!

ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు భగ్గుమంటోందా?.. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఆ నియోజకవర్గంలో ఎందుకు రద్దయ్యింది?.. సొంత పార్టీ నేతలే ఒత్తిడి చేసి రద్దు చేయించారా?.. మంత్రి టూర్ రద్దుపై ఆ నియోజకవర్గంలో ఎలాంటి చర్చ సాగుతోంది?.. ఇంతకీ.. ఏంటా నియోజకవర్గం?.. అసలు.. మంత్రి పర్యటన రద్దు వెనుక ఉన్న నిజాలేంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1954.jpg

22న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటనకు ప్లాన్‌

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. షెడ్యూల్ ప్రకారం.. హరీశ్‌రావు 22న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలను ప్రారంభించి, బోథ్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని షెడ్యూల్ విడుదలైంది. ముందు రోడ్డు మార్గం అని.. ఆ తర్వాత.. హెలీకాప్టర్‌లో వస్తారని హడావుడి చేశారు. ఆ మేరకు.. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ.. చివరి నిమిషంలో హరీశ్‌రావు పర్యటన రద్దు అయింది. దాంతో.. రాథోడ్ బాపురావు వ్యతిరేక వర్గం సంబురాలు చేసుకున్నట్లు తెలిసింది.

Untitled-18564.jpg

సడెన్‌గా పర్యటన రద్దు కావడంతో షాక్‌

వాస్తవానికి... బోథ్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల మధ్య ఎప్పటినుంచో విభేదాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యే బాపురావును సీనియర్లు విభేదిస్తున్నారు. బాపురావుకు టికెట్ రాదని ప్రచారం కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ఆయన వ్యతిరేకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే.. హరీశ్‌రావు పర్యటన ద్వారా పరపతి చూపించాలని భావించారు. కానీ.. సడెన్‌గా పర్యటన రద్దు కావడంతో షాకిచ్చినట్లు అయింది. ఫలితంగా.. ఎమ్మెల్యే ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగినట్లు అయింది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఒత్తిడి వల్లే హరీశ్‌ టూర్‌ రద్దు అయిందని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Untitled-2054.jpg

ఇది కూడా చదవండి: చికెన్ బిర్యానీలో పిల్లి మాంసం ముక్కలు..షాకైన కస్టమర్లు..!

బోథ్‌ బీఆర్ఎస్ సీనియర్‌ నేతల డుమ్మా

ఇదిలావుంటే... హరీశ్‌ పర్యటన రద్దు అయినా.. షెడ్యూల్ ప్రకారం అదే సమయానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కార్యక్రమం కొనసాగించారు. అయితే.. ఆయా కార్యక్రమాలకు బోథ్‌ బీఆర్ఎస్ సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ గోడం నగేష్‌, మాజీ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆ నేతలంతా బాపురావుతో ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నారు. ఇక.. నిజానికి.. హైదరాబాద్‌లో పని ఒత్తిడి కారణంగానే హరీశ్‌రావు పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. కానీ.. ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం దానికి భిన్నంగా ప్రచారం జరగడాన్ని బాపురావు వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Untitled-2154.jpg

మొత్తంగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు చాప కింద నీరులా సాగుతోంది. బోథ్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్‌ సీనియర్లుగా మారింది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-02-27T12:41:06+05:30 IST