Abu Dhabi: కార్మికుడికి రూ.33లక్షల పరిహారం.. కంపెనీకి న్యాయస్థానం ఆదేశం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-01-20T11:28:04+05:30 IST

పనిచేసే చోట జరిగిన ప్రమాదంలో చేతిని కోల్పోయిన కార్మికుడికి (Worker) 1లక్ష 50వేల దిర్హమ్స్(రూ.33.12లక్షలు) పరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీని అబుదాబి న్యాయస్థానం ఆదేశించింది.

Abu Dhabi: కార్మికుడికి రూ.33లక్షల పరిహారం.. కంపెనీకి న్యాయస్థానం ఆదేశం.. అసలేం జరిగిందంటే..

అబుదాబి: పనిచేసే చోట జరిగిన ప్రమాదంలో చేతిని కోల్పోయిన కార్మికుడికి (Worker) 1లక్ష 50వేల దిర్హమ్స్(రూ.33.12లక్షలు) పరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీని అబుదాబి న్యాయస్థానం ఆదేశించింది. కార్మికుడి మానసిక, భౌతిక నష్టాలకు పరిహారంగా (Compensation) అతనికి ఈ భారీ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా అబుదాబి అప్పీల్ కోర్టు (Abu Dhabi Appeals Court) కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. సంస్థ కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తగిన రక్షణ చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తాను ప్రమాదానికి గురైనట్లు బాధితుడు కోర్టుకు విన్నవించాడు.

ఈ ప్రమాదంలో చేతిని కోల్పోవడం తనకు భౌతిక నష్టాన్ని మిగిల్చిందని, దీనికి తనకు 2లక్షల దిర్హమ్స్ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానంలో దావా వేశాడు. ఇక అతడి పిటిషన్‌ను విచారించిన అబుదాబి క్రిమినల్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కంపెనీని దోషిగా నిర్ధారించింది. కార్మికుడికి నష్టపరిహారంగా లక్ష దిర్హమ్స్ చెల్లించాలని ఆదేశించింది. అయితే, తనకు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికుడు అప్పీల్ కోర్టులో దావా వేశాడు. తనకు జరిగిన ప్రమాదం కరాణంగా చేయి పోగొట్టుకోవడంతో తాను ఇకపై కొన్ని విధులు నిర్వహించలేనని తెలిపాడు. దీంతో అప్పీల్ కోర్టు కార్మికుడికి పరిహారంగా కంపెనీ రూ.33.12లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

Updated Date - 2023-01-20T11:28:05+05:30 IST