NRI: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-23T18:40:58+05:30 IST

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల వేడుక ఈసారి కూడా ఇక్కడి పొంగోల్ పార్క్‌లో ఘనంగా జరిగింది.

NRI: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్(Vasavi Club Merlion Singapore) వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల వేడుక(Sankranti Celebrations) ఈసారి కూడా ఇక్కడి పొంగోల్ పార్క్‌లో ఘనంగా జరిగింది. మన తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా, పిల్లలకు భోగి పళ్ళ దీవెనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. గొబ్బెమ్మలు, మహిళామణుల రంగు రంగుల రంగవల్లికల పోటీలు, పిల్లల పతంగుల తయారీ వంటి కార్యక్రమాలతో ఉత్సాహం వెల్లివిరిసింది. చిన్నారులు సంప్రదాయ దుస్తులలో పోటీ పడటమే గాక, తమ శ్రావ్యమైన గొంతులతో అనేక శ్లోకాలు, పాటలతో మురిపించారు. కార్యక్రమంలో ప్రత్యేకమైన సంక్రాతి థీమ్‌కు సంబంధించిన తెర ఏర్పాటులో సౌజి డేకర్స్ సంస్థ సభ్యులు సహకరించారు. ఫణీష్ ఆత్మురి చేసిన ‘సంక్రాతి శోభ’ ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.

3.jpgపసందైన సాంప్రదాయిక విందు భోజనంతో పాటు, రోజంతా సాగిన ఈ వేడుకలలో పిల్లలు, పెద్దలూ, దంపతులూ అనేక విన్నూత్నమైన ఆట పాటల్లో పాల్గొని ఆద్యంతమూ ఉల్లాసంగా గడిపారు. సుమారు 190 మంది పెద్దలు, 50 మంది పిల్లలు పాల్గొని విజయవంతం చేశారు. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ దశమ వార్షికోత్సవంలోనికి అడుగిడుతున్న శుభ తరుణంలో ఈ సంబరాల జరగడం విశేషం.

సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు తమ దైనందిన ఒత్తిడులను పక్కన బెట్టి, మన సంస్కృతిని ప్రతిబింబించేలా, అత్యంత సంఘీభావంతో ఈ వేడుకలలో పాల్గొనడం శ్లాఘనీయమని, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ అరుణ్ గోట్ల పేర్కొన్నారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి వర్చువల్‌గా మాట్లాడుతూ సింగపూర్‌లోని వైశ్యులు ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో గొప్పగా నిర్వహించారని, వైశ్యులు ఎప్పుడూ ఇలానే ధర్మసంబంధమైన, మన సాంప్రదాయ సంబంధమైన విషయాల్లో ముందుంటూ సమిష్టిగా మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేటి కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన సహచర కార్యనిర్వాహక బృంద సభ్యులకు, సేవా దళానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

5.jpg

సింగపూర్ ఆర్యవైశ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు.. మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రేరణనివ్వడమేగాక, భావితరానికి మన సంప్రదాయాలను, కుటుంబవిలువలను పరిచయం చేయడానికి ఒక చక్కని వేదికలా నిలిచాయని, ఈ కార్యక్రమ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ సభ్యుడు ముక్కా కిశోర్ పేర్కొన్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అందరూ చిన్నపిల్లలవలె ఆటపాటల్లో మునిగితేలారని కార్యక్రమనిర్వాహకకర్త రాయల సుమన్, దివ్య తెలిపారు.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన జానపద కోకిల, వైశ్య రత్నం డాక్టర్ అరుణ సుబ్బారావు ప్రత్యేక ప్రదర్శనలతో, పాటలతో ఆద్యంతం అందరిని ఆనందంలో ముంచెత్తారు.

2.jpg

కార్యక్రమం విజయవంతమవ్వడంలో సంస్థ సభ్యులైన సరిత, రాజా విశ్వనాథుల, రాఘవ, ఆనంద్, కిశోర్, శ్రీధర్ మంచికంటి, వాసవి సేవ సభ్యులైన శివ కిషన్, మార్తాండ్, చైతన్య, అవినాష్, చలం, గోపి కిషోర్, ప్రసాద్ బచ్చు, యదా నరేష్, పురుషోత్తం, సందీప్, సతీష్ వుద్దగిరి, సంతోష్ మాదారపు, మనోహర్, సత్య, దివ్య గాజులపల్లి, ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

4.jpg

Updated Date - 2023-01-23T18:42:30+05:30 IST