H-1B Visa: భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కు పండగలాంటి వార్త.. మనోళ్ల నిరీక్షణకు తెర!

ABN , First Publish Date - 2023-01-30T08:28:00+05:30 IST

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త.

H-1B Visa: భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కు పండగలాంటి వార్త.. మనోళ్ల నిరీక్షణకు తెర!

మార్చి 1 నుంచి హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

యూఎస్‌సీఐఎస్‌ వెల్లడి

వాషింగ్టన్‌, జనవరి 29: హెచ్‌-1బీ వీసా దరఖాస్తు కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త. మార్చి 1 నుంచి ఈ వీసాల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. ప్రతి సంవత్సరం భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 1 నుంచి 17 వరకు హెచ్‌-1బీ వీసాల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఈ వీసాల ద్వారా టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రత్యేక రంగాల్లో ఆరేళ్ల వరకు అమెరికాలో పని చేయడానికి, నివసించడానికి అనుమతి లభిస్తుంది. మార్చి 17 నాటికి సరిపోయేంతగా రిజిస్ర్టేషన్లను స్వీకరిస్తే వాటిని రాండమ్‌గా ఎంపిక చేస్తామని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

Updated Date - 2023-01-30T09:21:59+05:30 IST