TAJA: ‘తాజా’ 2023 సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-26T12:19:24+05:30 IST

గ్రేటర్ జాక్సన్విల్ ప్రాంతంలోని తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జాక్సన్విల్ తెలుగు సంఘం (Telugu Association of Jacksonville Area) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు.

TAJA: ‘తాజా’ 2023 సంక్రాంతి సంబరాలు

ఎన్నారై డెస్క్: గ్రేటర్ జాక్సన్విల్ ప్రాంతంలోని తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జాక్సన్విల్ తెలుగు సంఘం (Telugu Association of Jacksonville Area) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. జనవరి 21వ తేదీన తాజా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి, వారి టీమ్ ఆధ్వర్యంలో జాక్సన్విల్లోని బొల్లెస్మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలు అందరినీ తమ సొంత ఊరిలో వేడుకలను చేసుకుంటున్నామా అన్నట్లుగా మురిపించాయి.

TTTTTTTTT.jpg

తెలుగుదనంతో ప్రదర్శించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషను, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీ, సంప్రదాయ దుస్తుల పోటీలను కూడా నిర్వహించారు. రంగురంగుల అలంకరణలు, రుచికరమైన అల్పాహారం, స్వీట్లతో కూడిన రాత్రి భోజనం, ఇతర కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పద్మప్రియ కొల్లూరు, సమత దేవునూరి, వినయ యాద ఈవెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.

TTTTTTTTTT.jpg

ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి మాట్లాడుతూ.. ఈ వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ, సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. 'తాజా' (TAJA) ద్వారా కమ్యూనిటీకి నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలియజేశారు. 'తాజా' నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ఎగ్జిక్యూటివ్ టీమ్‌ను కూడా అభినందించారు.

TTTTTTT.jpg

కమిటీ సభ్యులు, వాలంటీర్లు, గ్రేటర్ జాక్సన్విల్లే ప్రాంత తెలుగు భాష, సంగీతం నేర్చుకునే పిల్లలు, మనబడి, పాఠశాల, సఖా ఇతర సంగీత పాఠశాలలు, తాజా కుటుంబాల వారి ఉపాధ్యాయుల మద్దతుతో జరిగిన ఈ వేడుకలు అందరినీ అలరించేలా సాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ 2023 సంక్రాంతి ఈవెంట్‌కు ఉదారంగా స్పాన్సర్షిప్ చేసినందుకు వాసవి గ్రూప్ యూఎస్ఎ, భవన్ సైబర్ టెక్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

TTTTT.jpg

రుచికమైన ఆహారాన్ని అందించినందుకు మసాలా ఇండియన్ క్యూసిన్ రెస్టారెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ వేడుకలకు ఆడియో వీడియో - అనిల్ యాడ, రాజేష్ చందుపట్ల.. తెరవెనుక - మల్లి సత్తి, నవీన్ మొదలి, శ్రీదేవి ముక్కోటి, దీప్తి పులగం.. ఫైనాన్స్ - శ్రీధర్ కాండే, శేఖర్ రెడ్డి సింగల, కృష్ణ పులగం, ధీరజ్ పొట్టి.. ఆపరేషన్స్ - నారాయణ కసిరెడ్డి, భాస్కర్ పాకాల, సునీల్ చింతలపాణి, లక్ష్మీ నారాయణ లింగంగుంట, ప్రవీణ్ వూటూరి, ఆర్కే స్వర్ణ, సంపత్ నంబూరి, రవి సత్యవరపు, వెంకట్ రెడ్డి బచ్చన్న.. వీడియో అండ్ ఫోటోగ్రఫీ - సత్యదీప్, జయ, సుమన్ సజ్జన, సంజీబ్ సింగ్.. అలంకరణ రంగోలి - శృతిక, నర్సన్న మాదాడి, రమ్య వలుస, వినీల, శ్రీకన్య సత్యవరపు, శ్యామల పొలాటి, గోమతి కండే, సుశీల దాలిబోయిన ఎంసీలుగా వ్యవహరించిన శ్రీధర్ డోగిపర్తి, పద్మ ప్రియ కొల్లూరు తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

TT.jpg

ఇక ఈ ఈవెంట్‌తో తాజా-2022 (TAJA-2022) కమిటీ శకం ముగిసింది. ప్రస్తుత అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి నూతన అధ్యక్షుడు మహేష్ బచ్చు, బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.

TTT.jpg

TTTTTTTTTTT.jpg

TTTTTT.jpg

Updated Date - 2023-01-26T12:22:25+05:30 IST