Saudi Arabia: యూఈఏ బాటలోనే సౌదీ.. మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు..!

ABN , First Publish Date - 2023-03-15T11:02:55+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

Saudi Arabia: యూఈఏ బాటలోనే సౌదీ.. మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు..!

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) బాటలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. గతేడాది యూఏఈ (UAE) మూడు రోజుల వీకెండ్‌ను (Three-Day Weekend) తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో శుక్రవారం హాఫ్‌డే, శని, ఆదివారాల్లో పూర్తిగా సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే మాదిరిగా సౌదీ కూడా త్రీ-డే వీకెండ్‌ యోచనలో ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Development) ఓ ట్వీట్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలిపింది.

ఆ ట్వీట్ ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న పని వ్యవస్థ (Work System) పై పూర్తి పరిశీలన అనంతరం వారంలో మూడు రోజుల సెలవులు ఇచ్చే విషయాన్ని వెల్లడించడం జరుగుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఓ లబ్ధిదారుడు ఈ విషయమై అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీకి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విధంగా స్పందించింది. పెరిగిన ఉద్యోగాల సృష్టిని సాధించడానికి, స్థానిక మరియు అంతర్జాతీయ పెట్టుబడులకు మార్కెట్ ఆకర్షణను పెంచడానికి మంత్రిత్వ శాఖ కాలానుగుణ సమీక్ష ద్వారా ప్రస్తుత పని విధానాన్ని అధ్యయనం చేస్తోందని ట్వీట్‌లో పేర్కొంది. అలాగే ప్రజాభిప్రాయం కోసం ఒక సర్వే ప్లాట్‌ఫారమ్‌లో ప్రస్తుత పని వ్యవస్థ ముసాయిదాను ముందుకు తెచ్చినట్లు కూడా వివరించింది.

ఇది కూడా చదవండి: వందకు పైగా దేశాల టూరిస్టులకు ఒమాన్ బంపరాఫర్.. కానీ, భారతీయులకు మాత్రం కండిషన్స్ అప్లై..!

Updated Date - 2023-03-15T11:02:55+05:30 IST