Eid Al Fitr: ఈద్ అల్ ఫితర్‌కు గల్ఫ్ దేశాల్లో 9రోజుల లాంగ్ వీకెండ్..?

ABN , First Publish Date - 2023-04-08T07:38:40+05:30 IST

ఈద్ అల్ ఫితర్‌ (Eid Al Fitr) కోసం అరబ్ దేశాల నివాసితులు సన్నద్ధం అవుతున్నారు.

Eid Al Fitr: ఈద్ అల్ ఫితర్‌కు గల్ఫ్ దేశాల్లో 9రోజుల లాంగ్ వీకెండ్..?

కువైత్ సిటీ: ఈద్ అల్ ఫితర్‌ (Eid Al Fitr) కోసం అరబ్ దేశాల నివాసితులు సన్నద్ధం అవుతున్నారు. ఈసారి గల్ఫ్ దేశాల్లో రంజాన్‌కు 9రోజుల లాంగ్ వీకెండ్ ఉండనుందట అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏప్రిల్ 20 నుంచి 23వ తేదీ వరకు ఈద్ సెలవులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీటికి వీకెండ్ సెలవులు కలుపుకుని తొమ్మిది రోజుల లాంగ్ వీకెండ్ (Long Weekend) రానుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడో దానిని బట్టి 29 లేదా 30 రోజుల పాటు రంజాన్ ఉపవాసాలు (రోజాలు) కొనసాగనున్నాయి. కాగా, ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం ఈ ఏడాది రంజాన్ ఉపవాసాలు (Ramdan Fasting) 29 రోజులపాటు ఉంటాయని తెలుస్తోంది. మార్చి 23న ఎమిరేట్స్‌లో పవిత్ర మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే.

బహ్రెయిన్

బహ్రెయిన్ (Bahrain) ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 21న (శుక్రవారం) వస్తుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగే అవకాశం ఉందని అక్కడి మతపెద్దలు చెబుతున్నారు.

కువైత్

కువైత్‌లో (Kuwait) కూడా లాంగ్ వీకెండ్ అనేది ఏప్రిల్ 21న ప్రారంభమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 23న (ఆదివారం) వరకు కొనసాగుతుంది.

ఒమాన్

ఒమాన్ (Oman) స్థానిక మీడియా సమాచారం ప్రకారం ఇక్కడ ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 22న (శనివారం) వచ్చే అవకాశం ఉంది. దాంతో నివాసితులు తొమ్మిది రోజులు లాంగ్ వీకెండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఒమాన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఉద్యోగులకు ఒకే విధంగా సెలవులు ఉంటాయి.

Kuwait: ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అంటున్న కువైత్.. 3నెలల్లో 9వేల మందిని వెళ్లగొట్టింది.. అందులోనూ మనోళ్లే అధికం..!


ఖతార్

ఇక్కడ ఈద్ (Eid) ఏప్రిల్ 21న (శుక్రవారం) ప్రారంభం కానుంది. సెలవులు వచ్చేసి ఏప్రిల్ 25 వరకు ఉంటాయనేది అక్కడి స్థానిక మీడియా సమాచారం.

సౌదీ అరేబియా

సౌదీ సెంట్రల్ బ్యాంక్ (Saudi Central Bank) ట్వీట్ ప్రకారం ఈద్ అల్ ఫితర్ సెలవులు (Leaves) ఏప్రిల్ 18న ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 25న (మంగళవారం) లాంగ్ వీకెండ్ ముగుస్తుందని, ఇదే రోజు యధావిధిగా విధులకు హాజరు కావాలని తన ట్వీట్‌లో పేర్కొంది.

Kuwait: ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అంటున్న కువైత్.. 3నెలల్లో 9వేల మందిని వెళ్లగొట్టింది.. అందులోనూ మనోళ్లే అధికం..!

Updated Date - 2023-04-08T07:38:40+05:30 IST