NRI: ఖతర్‌లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-01-24T20:31:17+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతర్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

NRI: ఖతర్‌లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు(Nara Lokesh Birthday) ఖతర్(Qatar) తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ(NRI TDP) నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సభ్యులు కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటూ ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతుల తదితరులు హాజరయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

2.jpg

Updated Date - 2023-01-24T20:31:25+05:30 IST