UAE: కావాలని చంపలేదన్న నిందితుడు.. రూ.67 లక్షలు ఇస్తే శిక్షను రద్దు చేస్తామన్న కోర్టు..!

ABN , First Publish Date - 2023-02-07T11:54:50+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) ఓ యువకుడిని అక్కడి న్యాయస్థానం ఓ హత్య కేసులో (Manslaughter) దోషిగా తేల్చడంతో పాటు మృతుడికి కుటుంబానికి పరిహారంగా 3లక్షల దిర్హమ్స్ (రూ.67లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.

UAE: కావాలని చంపలేదన్న నిందితుడు.. రూ.67 లక్షలు ఇస్తే శిక్షను రద్దు చేస్తామన్న కోర్టు..!

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) ఓ యువకుడిని అక్కడి న్యాయస్థానం ఓ హత్య కేసులో (Manslaughter) దోషిగా తేల్చడంతో పాటు మృతుడికి కుటుంబానికి పరిహారంగా 3లక్షల దిర్హమ్స్ (రూ.67లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. మొదట కింది స్థాయి కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. అక్కడ నిందితుడు తాను కావాలని చంపలేదని, ఏదో పొరపాటున అలా జరిగిపోయిందని న్యాయస్థానంలో తన వాదన వినిపించాడు. అయితే, కోర్టు మాత్రం ఈ సంఘటన ఎలా జరిగింది అనేది పక్కన పెడితే.. నీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి కనుక అతడి ఫ్యామిలీకి పరిహారంగా రూ.67లక్షలు ఇవ్వాల్సిందేనని తీర్పును వెల్లడించింది. అలాగే రెండు నెలల జైలు శిక్ష కూడా విధించింది.

ఇది కూడా చదవండి: షాకింగ్ గణాంకాలు.. సంఖ్యపరంగా ప్రవాసులే అధికంగా ఉన్నా.. అందులో మాత్రం కువైటీలదే పైచేయి..!

దాంతో యువకుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ అబుదాబి అప్పీల్ కోర్టులో కేసు వేశాడు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సమయంలో మరోసారి నిందితు తన గోడును కోర్టుకు విన్నవించాడు. ఇక్కడ కూడా కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పునే న్యాయస్థానం సమర్థించింది. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అందులోనూ ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి. దోషి కచ్చితంగా కింది కోర్టు చెప్పినట్లు మృతుడి కుటుంబానికి పరిహారం (Blood Money) రూపంలో రూ.67లక్షలు కడితే కేసు రద్దు అవుతుందని పేర్కొంది. అలాగే అతడికి విధించిన రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - 2023-02-07T11:54:51+05:30 IST