Joe Biden: రహస్య పత్రాలపై విచారణ.. బైడెన్‌కు ఏ పాపం తెలియదన్న వైట్‌‌హౌస్‌

ABN , First Publish Date - 2023-01-14T07:30:14+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసం సహా ప్రైవేటు కార్యాలయంలో వెలుగు చూసిన రహస్య పత్రాలపై విచారణకు రంగం సిద్ధమైంది.

Joe Biden: రహస్య పత్రాలపై విచారణ.. బైడెన్‌కు ఏ పాపం తెలియదన్న వైట్‌‌హౌస్‌

విచారణాధికారిగా మాజీ అటార్నీ రాబర్ట్‌ హర్‌

వాషింగ్టన్‌, జనవరి 13: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసం సహా ప్రైవేటు కార్యాలయంలో వెలుగు చూసిన రహస్య పత్రాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఈ రహస్య పత్రాల నిగ్గు తేల్చేందుకు మేరీల్యాండ్‌ జిల్లా మాజీ అటార్నీ రాబర్ట్‌ హర్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు యూఎస్‌ అటార్నీ జనరల్‌ మెర్రిక్‌ గార్లాండ్‌ గురువారం ప్రకటించారు. అత్యంత సునిశిత విషయాల్లో జవాబుదారీ తనం పెంపొందించే ఉద్దేశంతోనే విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ‘‘ఎలాంటి భయం లేకుండా వాస్తవాల ఆధారంగా వేగవంతమైన విచారణ చేసి.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, రహస్యపత్రాలపై విచారణను స్వాగతిస్తున్నట్టు అధ్యక్షుడు బైడెన్‌ తరఫు ప్రత్యేక కౌన్సిల్‌ రిచర్డ్‌ సాబెర్‌ తెలిపారు. వైట్‌ హౌస్‌ నుంచి సహకారం ఉంటుందన్నారు.

కాన్సాస్‌ సెనేటర్‌గా భారత సంతతి మహిళ

కాన్సాస్‌ రాష్ట్ర డిస్ర్టిక్ట్‌ 22 సెనేటర్‌గా డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు, భారత సంతతి మహిళ ఉషారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం ఈ పదవిలో ఉన్న మాన్‌హాటన్‌ సెనేటర్‌ టామ్‌ హాక్‌ గత నెలలో రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉషా రెడ్డి ఈ పదవిని స్వీకరించారు. కాగా, ఈ పదవి లభించడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఉషారెడ్డి ట్వీట్‌ చేశారు. మాన్‌హాటన్‌ నగర మేయర్‌గా రెండుసార్లు ఉషారెడ్డి పనిచేశారు. 1973లోనే ఉషా రెడ్డి కుటుంబం ఆమె 8 ఏళ్ల ప్రాయంలోనే అమెరికాకు వలస వెళ్లింది. గత 28 ఏళ్లకుపైగా ఆమె మాన్‌హాటన్‌లో నివసిస్తున్నారు.

Updated Date - 2023-01-14T07:30:15+05:30 IST