Share News

Mahzooz raffle draw: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.45కోట్లు!

ABN , First Publish Date - 2023-11-18T07:56:06+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా.

Mahzooz raffle draw: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.45కోట్లు!

Mahzooz raffle: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇదిగో ఫుజైరహా (Fujairah) లో ఉండే ఈ భారతీయ ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. మహజూజ్ రాఫెల్ డ్రా (Mahzooz raffle draw) లో భారత ప్రవాసుడి (Indian expat) కి జాక్‌పాట్ తగిలింది. కేరళకు చెందిన వ్యక్తి లాటరీలో ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ. 45కోట్లు. దీంతో భారతీయుడి ఆనందానికి అవధుల్లేవు.

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన శ్రీజు (Shreeju) గత 11 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. ఫుజైరహాలోని ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో టెక్నిషీయన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీజు గత మూడేళ్లుగా మహజూజ్ డ్రాలో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. తాజాగా మనోడికి అదృష్టం వరించింది. ఆదివారం తీసిన మహజూజ్ డ్రాలో శ్రీజుకు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక ఈ భారీ మొత్తం దక్కడం పట్ల మనోడి ఆనందానికి అవధులేకుండా పోయాయి. ఇంత డబ్బు గెలుస్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చాడు. మొదట తనకు లాటరీ తగిలిన విషయం తెలియగానే నమ్మలేదని.. రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో నమ్మినట్లు తెలిపాడు. ఇక తాను గెలిచిన భారీ మొత్తంతో తన స్వగ్రామంలో ఇల్లు కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో లాటరీల పుణ్యమా అని మధ్యతరగతికి చెందిన మనోళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు.

Retirement visa: యూఏఈలోని ప్రవాసులకు పదవీ విరమణ వీసా.. దరఖాస్తు ఇలా..!


Updated Date - 2023-11-18T08:47:16+05:30 IST