Kuwait: ప్రవాసులకు హజ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం

ABN , First Publish Date - 2023-01-26T10:31:29+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) తమ దేశ పౌరులతో పాటు ప్రవాసులకు కూడా హజ్ యాత్ర (Hajj Pilgrimage) కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించింది.

Kuwait: ప్రవాసులకు హజ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) తమ దేశ పౌరులతో పాటు ప్రవాసులకు కూడా హజ్ యాత్ర (Hajj Pilgrimage) కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ అవాఖఫ్ అండ్ ఇస్లామిక్ అఫైర్స్‌కు (Ministry of Awqaf and Islamic Affairs) చెందిన హజ్ అండ్ ఉమ్రా విభాగం ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్‌లో హజ్ చేయాలనుకునే పౌరులు, ప్రవాసులు అందరూ అధికారిక వెబ్‌సైట్ http://hajj-register.awqaf.gov.kw. ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 29వ తేదీ (ఆదివారం) నుంచి ప్రారంభం అవుతుందని, ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. ఇతర వివరాల కోసం 99051691 నం.కు కాల్ చేయడం లేదా 22342385, 22342238 నంబర్లకు వాట్సాప్ చేయవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Updated Date - 2023-01-26T10:31:31+05:30 IST