ATA: డాలస్‌లో 'ఆటా' సంస్థ నిర్వహించిన శతావధానం అపూర్వం

ABN , First Publish Date - 2023-05-04T12:26:40+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య వేదిక తన సాహితిసేవా ప్రామాణిక విలువలను పెంచుతూ జరిపిన శతావధానం సంస్థ కీర్తికిరీటంలో ఇంకో కలికితురాయిగా నిలిచింది.

ATA: డాలస్‌లో 'ఆటా' సంస్థ నిర్వహించిన శతావధానం అపూర్వం

డాలస్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య వేదిక తన సాహితిసేవా ప్రామాణిక విలువలను పెంచుతూ జరిపిన శతావధానం సంస్థ కీర్తికిరీటంలో ఇంకో కలికితురాయిగా నిలిచింది. ఆటా సాహిత్య వేదిక నిర్వహించిన త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తిపద్మా కర్ షోడష శతావధాన మహా పక్రియకు ఏప్రిల్ 29న (శనివారం) డాలస్ మహానగరంలోని ఫ్రిస్కో వేదికయ్యింది. శతాధిక పృఛ్ఛకులు, ముగ్గురు అపస్ర్తుత పస్రంగీకులు, 35 సమస్యలు, 35 వర్ణనలు, 35 ఆశువులతో అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నుల పండువగా సాగింది. సాహిత్యవేదిక అధిపతి సింగిరెడ్డి శారద, ఆటా అధ్యక్షులు మధు బొమ్మి నేని ముందుండి నడిపిన ఈ శతావధాన పక్రియ ఆద్యంతం అమెరికా వాసులకు తెలుగుభాష మీదున్న పట్టును, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ ధారణాశక్తికి అద్దం పట్టాయి.

AA.jpg

అనంతరం వద్ధిపర్తి దంపతులకు కనకాభిషేకం చేసి “అవధాన విశ్వగురు బ్రహ్మ” బిరుదు పద్రానం చేసారు. ముందుగా ఈ కార్యక్రమానికి పాలకమండలి సభ్యులు సతీష్ రెడ్డి, సోమ శేఖర్ రెడ్డి, రామ్ అన్నా డి, పూర్వాధ్యక్షులు డా. సంధ్య గవ్వ, శ్రీనివాస్ పిన్నప రెడ్డి, ఆత్మ చరణ్ రెడ్డి, ఆటా కార్యవర్గ బృందం అనంత్ రెడ్డి పజ్జూర్, రవి తూపురాని, నీరజ పడిగెల, స్వప్న తుమ్మపాల, మంజు రెడ్డిముప్పిడి, సుమన బీరం, లక్ష్మి పోరెడ్డి, మహేందర్ గణపురం, సత్య పెర్కారి, వెంకట్ కోడూరి, దామోదర్ ఆకుల, అశోక్ పొద్దుటూరి, విక్రమ్ బొర్ర, శ్రీనివాస్ కల్లూరి, రవికాంత్ మామిడి, సుధాకర్ కలసాని, అనురాధ మేకల కలసి పూర్ణకుంభంతో అవధానులను సభకు ఆహ్వానించి, జ్యోతి పజ్ర్వలన గావించారు. ఆ తర్వాత మల్లికా సుర్యదేవర ప్రార్ధనాగీతం ఆలపించారు.

AAA.jpg

అనంతరం ఆటా సాహిత్య వేదిక అధిపతి శారద సింగిరెడ్డి, అధ్యక్షులు మధు బొమ్మి నేని.. త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్‌ను, సంచాలకులు డా. పుదూర్ జగదీశ్వరన్, డా. మద్దూ రివేంకట సుబ్రమణ్య సత్యనారాయణను సభకు పరిచయం చేశారు. డా. మద్దూ రివేంకట సుబ్రమణ్య సత్యనారాయణ, బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గురించి మరిన్ని విశేషాలను సభాసదులకు తెలియజేశారు. అనంతరం 'అమెరికా అవధాని' డా. పుదూర్ జగదీశ్వరన్ సంచాలకులుగా వ్యవహరించి పృఛ్ఛకులకు, విచ్చేసిన వీక్షకులకు శతావధాన పక్రియ నియమాలను వివరించారు. ఆ తరువాత బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మా కర్ ఇష్టదేవతా ప్రార్ధనతో శతావధానాన్ని ప్రారంభించారు.

AAAA.jpg

సాధారణంగా మూడురోజులపాటు జరగాల్సిన శతావధానం నిర్వాహకుల సంసిద్ధత, "సప్తఖండ అవధాన సాహితీ ఝరి" సృష్టికర్త, సహస్రావధాని వద్ధిపర్తి పద్మా కర్ పాండిత్య సమర్ధత, డాలస్ "పెద్దనామాత్యులు"గా పస్రిద్ధులయిన డా. పుదూర్ జగదీశ్వరన్, ధార్మిక పవ్రచనశేఖర బిరుదాంకితులు డా.మద్దూ రివేంకట సుబ్రమణ్య సత్యనారాయణ సంచాలకులుగా వ్యవహరించడం, ప్రాజ్ఞులయిన పృరఛ్ఛకుల నిబద్దత మూలంగా ఒకేరోజులో పూర్తి చేయగలిగారు. సమస్యా విభాగములో పృఛ్ఛకులు ఆడిగిన ప్రతీ సమస్యను అలవోకగా అవధాని పూరించారు.

AAAAA.jpg

ఉదాహరణకు చందశ్రేఖర్ జలసూతంర్ అడిగిన "రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతమ్ము లో" సమస్యకు, గౌతమ్ కస్తూరి "పౌండక్ర వాసుదేవునకు పాదములొత్తెను సత్యభామయున్" సమస్యకు వద్దిపర్తి పూరణ విశేషప్రతిభకు నిదర్శనం. అలాగే మాధురిచామర్తి "తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు అయితే" పరిమళ మార్పాక "కోవిదుడికి కోవిడ్ వస్తే?", ఉదయ్ వొమరవెల్లి "అమెరికా పిల్లలు తెలుగు భాష నేర్చుకోవడం" మీద ఆశువుగా అల్లిన పద్యాలు సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించాయి.

AAAAAA.jpg

ఇంకా మురళి శ్రీరాం టెక్కలకోట వర్ణణాంశం "ఓం! అంటావా మామా, హరిఓం!! అంటావా", మూర్తి జి అందవోలు వర్ణణాంశం "వినత, కద్రువల పంతం" సాహితీ ప్రియులను రంజింపజేసాయి. డా. నరసింహారెడ్డి ఊరిమిండి, డా. వంగూరి చిట్టెన్ రాజు, విజయసారధి జీడిగుంట్ల అపస్ర్తుత పస్రంగీకులుగా అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి లేఖకులుగా డా. రమణ దొడ్ల, ఉప లేఖకులుగా వేంకట రామారావు పాలూరి వ్యవహరించారు. చివరగా త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ అద్భుతమైన సమస్యలు, ఆశువులు, వర్ణనలతో సభను మరింత రక్తికట్టించిన పృఛ్ఛకులను, అపస్ర్తుత పస్రంగీకులను పశ్రంసించారు.

AAAAAAAA.jpg

అలాగే ఆటా కార్యవర్గాన్ని, డాలస్ తెలుగు పజ్రలను అభినందించారు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఆటా అంటే తెలుగు, తెలుగు అంటే ఆటా అనేలా ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆటా సంస్థకు తమ దివ్యా శీస్సులు అందించారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మి నేని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు. సాహిత్యవేదిక సభ్యులు శారద సింగిరెడ్డి, రవి తూపురాని, వీరన్న పంజాల, మాధవి దాస్యంలను అభినందించారు.

AAAAAAAAA.jpg

Updated Date - 2023-05-04T12:26:40+05:30 IST