CNN Hero in America: అగ్రరాజ్యంలో తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2023-01-22T07:41:26+05:30 IST

అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు (Sri Nihal Tammana) అరుదైన గౌరవం లభించింది.

CNN Hero in America: అగ్రరాజ్యంలో తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌కు అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు (Sri Nihal Tammana) అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ హీరోస్ (CNN Hero) కార్యక్రమంలో శ్రీనిహాల్ తమ్మనను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీనిహాల్ రియల్ హీరో అని ప్రశంసించింది. ఇక శ్రీనిహాల్ తిమ్మన 13 ఏళ్ల వయస్సులోనే సమాజ శ్రేయస్సు కోసం.. పర్యావరణ మేలు కోసం వినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. అందరూ వాడి పడేస్తున్న బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసే ప్రక్రియను చేపట్టాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీసైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు పనికిరాని, చెల్లిన బ్యాటరీలను సేకరించే పనికి శ్రీకారం చుట్టాడు. వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్‌‌కు పంపించాడు. సీఎన్ఎన్ ఛానల్ శ్రీ నిహల్ చేసిన సేవలను గుర్తించింది. సమాజంలో మార్పులు కోసం శ్రమించే.. సమస్యలకు పరిష్కారాలు వెతికే రియల్ హీరోస్‌ను సీఎన్ఎన్ హీరోస్ పేరుతో సత్కరిస్తుంది. శ్రీ నిహల్ రియల్ హీరో అని సీఎన్ఎన్ ప్రశంసించింది. అతడిని సత్కరించింది. ప్రస్తుతం శ్రీ నిహాల్ న్యూజెర్సీలో ఉంటున్నాడు.

Sri-Vihal.jpg

Updated Date - 2023-01-22T07:41:28+05:30 IST