Kuwait: 530 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ.. అత్యధికులు ఆసియా వాసులే!

ABN , First Publish Date - 2023-01-27T08:34:16+05:30 IST

ఇటీవల కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kuwait International Airport) వినియోగిస్తున్న కొత్త టెక్నాలజీ కారణంగా ఫోర్జరీ పత్రాలతో (Forged Documents) దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారు భారీ సంఖ్యలో పట్టుబడుతున్నారు.

Kuwait: 530 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ.. అత్యధికులు ఆసియా వాసులే!

కువైత్ సిటీ: ఇటీవల కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kuwait International Airport) వినియోగిస్తున్న కొత్త టెక్నాలజీ కారణంగా ఫోర్జరీ పత్రాలతో (Forged Documents) దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారు భారీ సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 530 మంది ప్రవాసులను (Expats) కువైత్ అధికారులు దేశం నుంచి బహిష్కరించారు (Deported). వీరంతా నకిలీ పాస్‌పోర్ట్స్, తప్పుడు పేర్లతో దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా వాసులు ఉన్నారట. ఇక దేశ బహిర్కరణకు గురైన వారిలో 120 మంది మహిళలు కూడా ఉన్నారు.

కాగా, గల్ఫ్ దేశాల మధ్య బహిష్కరణకు గురైన వారి వేలిముద్రల డేటాను మార్పిడి చేసే వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గల్ఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ టీమ్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్‌కు చెందిన 'ఐడెంటిటీ ఇన్వెస్టిగేషన్' విభాగం పాత్ర కీలకమని ఈ సందర్భంగా సబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా బహిష్కరణకు గురైన వారందరి డేటా ప్రత్యేక సిస్టమ్‌లో నిల్వ చేయబడుతుంది. దాంతో దేశం నుండి లేదా ఏదైనా జీసీసీ (GCC) దేశం నుండి బహిష్కరించబడిన వ్యక్తిని గుర్తించగల సామర్థ్యం సిస్టమ్ కలిగి ఉంటుంది.

ఇదిలాఉంటే.. 2011 ముందు వరకు ఒకసారి దేశం నుంచి బహిష్కరించబడిన వలసదారులు తమ పేర్లు మార్చుకుని తిరిగి కువైత్ వచ్చేవారట. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించే వారిని క్షణాల్లో గుర్తించడం, నేర తీవ్రతను బట్టి దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది కువైత్.

Updated Date - 2023-01-27T08:35:11+05:30 IST