Kuwait: ప్రవాసులపై పగబట్టిన కువైత్.. నెల రోజుల వ్యవధిలోనే 2వేల డ్రైవింగ్ లైసెన్స్‌ వెనక్కి..!

ABN , First Publish Date - 2023-02-08T10:54:24+05:30 IST

ప్రవాసులకు (Expats) గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల (Driving Licenses) విషయంలో కువైత్ చుక్కలు చూపిస్తోంది. వాటి జారీకి కొత్త రూల్ (New Rule) తీసుకురావడంతో పాటు కఠిన నిబంధనలు విధించింది.

Kuwait: ప్రవాసులపై పగబట్టిన కువైత్.. నెల రోజుల వ్యవధిలోనే 2వేల డ్రైవింగ్ లైసెన్స్‌ వెనక్కి..!

కువైత్‌ సిటీ: ప్రవాసులకు (Expats) గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల (Driving Licenses) విషయంలో కువైత్ చుక్కలు చూపిస్తోంది. వాటి జారీకి కొత్త రూల్ (New Rule) తీసుకురావడంతో పాటు కఠిన నిబంధనలు విధించింది. దీనిలో భాగంగా గడిచిని నెల రోజుల వ్యవధిలోనే ఆ దేశ ట్రాఫిక్ విభాగం (Traffic Department) ఏకంగా 2వేల మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ 2వేల మంది జాబితాను సిద్దం చేసింది కూడా. వీరందరికి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కావాల్సిన అర్హతలు లేవని తమ విచారణలో తేలినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అందుకే వారి నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ను జప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక గతేడాది వలసదారులకు డ్రైవింగ్ లైసెన్ జారీ కోసం కువైత్ (Kuwait) కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా యూనివర్శిటీ డిగ్రీ ఉండి, నెలకు 600 కువైటీ దినార్ల(రూ.1.49లక్షలు)కు తగ్గకుండా శాలరీ ఉన్న ప్రవాసులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ ప్రాసెస్‌లో భాగంగా సంబంధిత మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా వలసదారులకు మంజూరు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌లను ఫిల్టర్ చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగాన్ని సూచించారు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఓ ప్రవాస అకౌంటెంట్ (Expat Accountant) యూనివర్శిటీ డిగ్రీ కలిగి ఉండి, నెలకు 600కేడీ (రూ.1.49లక్షలు) శాలరీ తీసుకుంటున్నాడనుకోండి. కానీ, అతడు రెండో యజమానికి మారే సమయంలో జీతం 400కేడీలకు తగ్గితే ఆ అకౌంటెంట్ డ్రైవింగ్ లైసెల్స్ ఉపసంహరించాల్సి ఉంటుందని ట్రాఫిక్ విభాగానికి అండర్ సెక్రటరీ సూచించారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Dubai లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్.. కేవలం 4500 రూపాయలు చెల్లిస్తే..


దేశంలో గత కొంతకాలంగా భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, సాంద్రతను తగ్గించే క్రమంలో కువైత్ ఇలాంటి సంచలన నిర్ణయాలకు శ్రీకారం చూడుతోందని అక్కడి మీడియా చెబుతున్న మాట. ఇక ఈ ఏడాది జనవరి 17 నుంచి ట్రాఫిక్ విభాగం ప్రవాసులే లక్ష్యంగా మూడో దశ 'స్మార్ట్ లైసెన్స్' జారీ ప్రక్రియను మొదలు పెట్టంది. దీనిలో భాగంగానే తాజాగా తెరపైకి తెచ్చిన కొత్త రూల్‌ను పరీక్షించాలని అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విధానం అమలులోకి రావడంతో ఇప్పుడు భారీ సంఖ్యలో ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్లను కోల్పోవడం జరుగుతుంది.

Updated Date - 2023-02-08T10:54:26+05:30 IST