Study Table: చదువుకునే పిల్లల స్టడీ టేబుల్ ఈ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే.. !

ABN , First Publish Date - 2023-03-21T12:39:17+05:30 IST

స్టడీ టేబుల్‌ ఇంట్లో సరైన దిశలో ఉండాలి.

Study Table: చదువుకునే పిల్లల స్టడీ టేబుల్ ఈ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే.. !
education

పిల్లలు చదివే తీరును పదే పదే పరిశీలిస్తూ ఉంటాం. కానీ పిల్లవాడు ఏ దిక్కున కూర్చుని చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది పెద్దగా పట్టించుకోం. పైగా చీకటిగా పెద్ద వెలుగు ప్రశరించని మూలల్లో పిల్లల స్టడీ టేబుల్ వేస్తూ ఉంటాం. అసలు పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ ఏ దిక్కులో ఉండాలి. స్టడీ టేబుల్‌ ఇంట్లో సరైన దిశలో ఉండాలి. పిల్లవాడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసే విధంగా స్టడీ టేబుల్‌ని ఉంచాలి. ఇది పిల్లలు జ్ఞానాన్ని గ్రహించి, నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

ఈ దిక్కులో కూర్చుంటే దైవ బలం కూడా గట్టిగానే ఉంటుంది. ఇది సమాచారాన్ని గ్రహించి, గుర్తుపెట్టుకునే శక్తిని వేగవంతం చేస్తుంది. పరీక్షలకు ముందు ఒత్తిడి, ఆందోళన, భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో, పరీక్షలను రాసేలా సిద్ధంగా ఉంటారు. ఈ దిక్కులో ఎక్కువగా కూర్చుని చదువుకోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఉగాది రోజు రావి ఆకుతో ఇంట్లో దీపం పెడితే.. ఏమవుతుందో తెలుసా..!

వాస్తు ప్రకారం, ఇంటి వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ (WSW) దిక్కు స్టడీ టేబుల్‌ని ఉంచడానికి ఉత్తమమైన జోన్. రెండవది ఇంటి నార్త్ ఈస్ట్ జోన్ మంచి సపోర్ట్ ఇస్తాయి.

1. పరిశోధనా పనిలో ఉన్నట్లయితే, స్టడీ టేబుల్‌ను ఉంచడానికి నార్త్ ఈస్ట్ మంచిది.

2. పొలిటికల్ సైన్స్ చదవడానికి ఇష్టపడే విద్యార్థులకు స్టడీ టేబుల్ తూర్పు మంచిది

3. లా చదివే విద్యార్థులకు ఆగ్నేయం ఉత్తమ జోన్

4. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చుంటే ఉత్తమమైన ఫలితం ఉంటుంది.

Updated Date - 2023-03-21T12:41:44+05:30 IST