Ugadi: ఉగాది రోజు రావి ఆకుతో ఇంట్లో దీపం పెడితే.. ఏమవుతుందో తెలుసా..!

ABN , First Publish Date - 2023-03-21T09:29:16+05:30 IST

రావి ఆకు దీపాన్ని ఉంచడం వల్ల చాలా శుభాలు కలుగుతాయి.

Ugadi: ఉగాది రోజు రావి ఆకుతో ఇంట్లో దీపం పెడితే.. ఏమవుతుందో తెలుసా..!
Yugadi or Ugadi

ఉగాది పండుగ తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున దేవుడిని నిష్టగా పూజిస్తే కుటుంబం సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. నువ్వుల నూనె, నలుగుపిండితో తలంటు పోసుకోవాలట. కొత్తబట్టలు కట్టుకొని, పూజా గది ముందు చక్కగా ముగ్గులు వేసి దేవుడి గడిని అలంకరించుకోవాలి.

పూజా గదితో పాటుగా, ఇంటినంతా శుభ్రపరుచుకోవాలి. ముఖ్యంగా తెలుగు వారి సాంప్రదాయంగా గడపటను కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. అలాగే గుమ్మాలకు మామిడి, వేపకొమ్మలు, బంతిపూలు కట్టాలి. వీటివల్ల ఇంటి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు రావు. పూజలో వివిధ రకాల పూలను ఉపయోగించాలి. ఉగాది రోజున ఇష్టదేవతలకు ఉదయం ఏడు నుంచి పది గంటల మధ్య ఎప్పుడైనా పూజించొచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజున రాశి ఫలాలను సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందోనని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఈ దిక్కులో తమలపాకు తీగను పెంచారంటే.. డబ్బే డబ్బు..!

సాంప్రదాయం ప్రకారం, ఉగాది పచ్చడిని తయారుచేసుకోవాలి. చింతపండు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ, కొబ్బరి ముక్కలు, మిరపకాయలతో పచ్చడిని తయారుచేసి ఇష్ట దేవతలకు నైవేధ్యంగా సమర్పించాలి. ఈ ఏడాదంతా.. ఆనందంగా ఎలాంటి కష్టాలు ఎదురు కాకూడదని ఆ దేవుడిని మొక్కి ప్రసాదం స్వీకరించాలి. ఉగాది పర్వదినంలో ముఖ్యంగా రావాకు దీపాన్ని ఉంచడం వల్ల చాలా శుభాలు కలుగుతాయి.

ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగించాలి. రావిచెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి. దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

Updated Date - 2023-03-21T10:10:58+05:30 IST