Betel Plant : ఈ దిక్కులో తమలపాకు తీగను పెంచారంటే.. డబ్బే డబ్బు..!

ABN , First Publish Date - 2023-03-16T09:15:42+05:30 IST

అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాల‌న్నా కూడా త‌మ‌ల‌పాకు చెట్టును మ‌న ఇంట్లో పెంచుకోవాలి.

Betel Plant : ఈ దిక్కులో తమలపాకు తీగను పెంచారంటే.. డబ్బే డబ్బు..!
Mouth Freshener Betel Plant

ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి? వాస్తు పాటించాలా...?

వాస్తు ప్రకారం చేసే ప్రతి పనికి మంచి ఫలితాలుంటాయి. అయితే ఏ వస్తువును ఎక్కడ ఉంచాలి అనేది ఖచ్చితంగా వాస్తు శాస్త్రం చెబుతూనే ఉంటుంది. అయితే వస్తువులనే కాదు. మనం మామూలుగా పెంచుకునే ఇంటి మొక్కలను కూడా వాస్తు ప్రకారం పెంచడం చాలా ముఖ్యం. వీటితో ధన లాభం కూడా సులువుగా కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్న మాట. కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే అందుకుంటాం. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని ఉంచుతుంటారు. అయితే తులసి మొక్క తరువాత తమలపాకు మొక్కకు అంత పవిత్రత ఉంది.

చాలావరకూ మొక్కలు ఉంచేది సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

ఇది కూడా చదవండి: తులసి మొక్కకు రోజూ నీళ్ళు పోస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు..!

ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం తమలపాకు వంటి మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. ఎన్ని మొక్కలు నాటినా ఫలితం వుండదు. అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయి. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్‌కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి. తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు.

త‌మ‌ల పాకు తీగ..

త‌మ‌ల‌పాకును తాంబూలంగా వాడుతుంటాం. దీనిని నాగ‌వ‌ల్లి అని కూడా అంటారు. హిందూ సాంప్ర‌దాయాల ప్ర‌కారం త‌మ‌ల‌పాకుకు ఎంతో విశిష్ట‌త ఉంది. ఆయుర్వేదంలో కూడా త‌మ‌ల‌పాకును ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ఏ ఇంట్లో అయితే త‌మ‌ల‌పాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శ‌నీశ్వ‌రుడుకి తావు ఉండ‌దు అని పండితుల మాట. త‌మ‌ల‌పాకు మన ఇంట్లో ఉంటే మ‌న క‌ష్టాలు తీరతాయట. మ‌న‌కు అదృష్టం క‌లిగి ప‌ట్టింద‌ల్లా బంగారమే అవుతుంది. డబ్బుకు కూడా లోటు ఉండదు. ఇది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్ర‌హ‌దోషాలు ఉండ‌వు. భూత ప్రేత పిశాచులు ఇంటి ద‌రిదాపుల్లోకి కూడా రావు.

త‌మ‌ల‌పాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజ‌నేయ స్వామి మ‌న ఇంట్లో ఉన్న‌ట్టే. ఈ మొక్క ఏపుగా పెరిగితే ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కూడా మ‌న మీద ఉన్న‌ట్టే. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాల‌న్నా కూడా త‌మ‌ల‌పాకు చెట్టును మ‌న ఇంట్లో పెంచుకోవాలి. ధ‌నానికి లోటు ఉండకూడదంటే.. ప్ర‌తిరోజూ ఒక త‌మ‌ల‌పాకును తీసుకుని నువ్వుల నూనె క‌లిపిన సింధూరంతో శ్రీ‌రామ అని రాసి, ఆంజ‌నేయ స్వామి ఫోటో ముందు ఉంచి న‌మ‌స్కరించాలి. మ‌రుస‌టి రోజు పారే నీటిలో వేయ‌డం కానీ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌వ‌చ్చని పండితులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-16T09:15:42+05:30 IST