Share News

Suffering from sciatica pain: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా? ఈ యోగా భంగిమలు నొప్పి నుండి ఉపశమనం ఎలాగంటే..!

ABN , Publish Date - Dec 21 , 2023 | 12:06 PM

సయాటికా చుట్టూ ఉన్న కండరాలు కణాజాలలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Suffering from sciatica pain: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా? ఈ యోగా భంగిమలు నొప్పి నుండి ఉపశమనం ఎలాగంటే..!
pain relief

సయాటిక్ నరాల నొప్పిని మనలో చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. యోగా భంగిమలను అనుసరిస్తూ ఈ తీవ్రమైన నొప్పి నుంచి బయటపడవచ్చు. మన శరీరంలోని అనేక సమస్యలకు యోగా చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. అందులో ముఖ్యంగా ఎలివేటెడ్ పావురం భంగిమ, కూర్చున్న పావురం ఫోజ్, కూర్చున్న పైజెన్ పోజ్ ఇలాంటి భంగిమలతో సయాటిక్ నరాల నొప్పిని తరిమి కొట్టవచ్చు. ప్రతి భంగిమను 15 సెకన్లతో ప్రారంభించి, ఆపై ప్రతి వైపు 1 నిమిషం వరకు వెళ్ళాలి.

సయాటికా నరం దిగువ వీపు నుంచి కాలు వెనుక భాగం గుండా వెళుతుంది. వెన్నెముకలోని హెర్నియేటెడ్ డిస్క్ లేదా బోన్ స్పర్ సయాటికా నరాల మీద నొక్కినపుడు సయాటికా నొప్పి వస్తుంది. ఈ నొప్పి వెన్నెముకలో పుడుతుంది. కాలు వెనుక భాగంలో ప్రసరిస్తుంది. ఇది వాపు, నొప్పి, కాలులో తిమ్మిరిని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడే యాంటీ-కోల్డ్ సిరప్‌ వినియోగంపై కేంద్రం నిషేధం..!!

ముఖ్యంగా పావురం భంగిమను చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది తుంటిలో కదలిక పరిధిని మెరుగుపరుస్తుంది. వెన్నుపూస, కాళ్ళలో కండరాలను బలోపేతం చేస్తాయి. కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తాయి. సయాటికా చుట్టూ ఉన్న కండరాలు కణాజాలలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.


సయాటికాకు కొన్ని కారణాలు :

హెర్నియేటెడ్ లేదా స్లిప్డ్ డిస్క్ : ఇది నరాల మూలంపై ఒత్తిడి కలిగించి సయాటికాకు కారణం అవుతుంది.

పిరిఫార్మిస్ సిండ్రోమ్ : ఇది పిరుదులలో లోతుగా ఉన్న చిన్న పిరిఫార్మిస్ కండరం బిగుతుగా మారుతుంది. దీనితో తుంటి, తొడ వెనుక భాగంలో నరాల మీద ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది.

వెన్నెముక స్టెనోసిస్ : ఇది నరాలపై ఒత్తిడి ఫలితంగా వస్తుంది.

స్పోండిలోలిస్థెసిస్ : వెన్నుపూస జారిపోయినప్పుడు ఇది మొదలవుతుంది..


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 12:10 PM