Touch me not: పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధికి అత్తిపత్తి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.. దీనిని ఎలా తీసుకోవాలంటే..!

ABN , First Publish Date - 2023-03-27T11:44:53+05:30 IST

మన చుట్టూ ఉన్న అనేక మొక్కల గురించి మనకు సరిగా తెలియదు.

Touch me not: పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధికి అత్తిపత్తి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.. దీనిని ఎలా తీసుకోవాలంటే..!
Touch Me Not Plant,

ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పేరు పొందింది కానీ అసులు సంగతికొస్తే. ముట్టుకోగానే ముడుచుకోవడమే కాదు.. ఔషదంగా కూడా ఈ అత్తిపత్తి మంచి గుణాలను కలిగి ఉందట. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది. ఇది మన భారతదేశంలోనూ విరివిగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పశువులు మేతగా తీసుకుంటూ ఉంటాయి. అయితే దీనిలోని గుణాల సంగతికొస్తే చాలా మందిలో సంతానలేమిని తగ్గిస్తుందట. ముఖ్యంగా మగవారిలోని సమస్యలను తీసేస్తుందట.

1. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అత్తిప‌త్తి మొక్క మొత్తాన్ని శుభ్రంగా క‌డిగి ఎండ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ 2 గ్రాముల మోతాదులో సేవిస్తూ ఉంటే షుగ‌ర్ వ్యాధి త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

2. 400 ఎంఎల్ నీటిలో ఈ మొక్క వేర్ల‌ను వేసి 100 ఎంఎల్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఇలా మ‌రిగించిన నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్త విరేచ‌నాలు త‌గ్గుతాయి.

Untitled-1.jpg

3. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో కూడా ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ను సేక‌రించి ఎండ‌బెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా ఒక గ్లాస్ పాల‌లో క‌లుపుకుని రాత్రి పూట తాగ‌డం వల్ల పురుషుల‌ల్లో వీర్య వృద్ధి క‌లుగుతుంది.

ఇది కూడా చదవండి: చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 కూరగాయలు రోజూ తినాలి.. అవేంటంటే..

4. నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్త‌స్రావం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న స్త్రీలకు అత్తిప‌త్తి మొక్క దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. అత్తిప‌త్తి మొక్క వేరును దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సానికి న‌ల్ల మిరియాల‌ను, తేనెను క‌లిపి 3 గంట‌ల‌కొక‌సారి తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం స‌మ‌స్య త‌గ్గుతుంది.

మన చుట్టూ ఉన్న అనేక మొక్కల గురించి మనకు సరిగా తెలియదు. తెలిసాకా ఓ ఇది రోజూ చూస్తున్నానే అనుకుంటాం. అసలు మొక్కల్లోని గుణాలను తెలుసుకుని ఆరోగ్యానికి ఉపయోగించుకుంటే ఇలా అనారోగ్య సమస్యలతో కాలాన్ని గడపాల్సిన అవసరం లేదు. ఇక మన సమస్యలకు చాలావరకూ పరిష్కారాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయి.

Updated Date - 2023-03-27T11:44:53+05:30 IST