Health Facts: బరువు తగ్గడం ఇంత సింపులా..? ఈ 4 రకాల డ్రైఫ్రూట్స్‌తో కొవ్వు కరిగిపోవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-12-01T16:40:22+05:30 IST
శరీరం బరువు పెరిగేందుకు ముఖ్య కారణం తినే ఆహారం విషయంలో కాస్త కఠినంగా ఉండక తప్పదు.
బరువు తగ్గడం అంటే దాని వెనుక చాలా కృషి, పట్టుదల అవసరం అవుతాయి. జీవన శైలిలో కూడా చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఊబకాయాన్ని వదిలించుకోవడం అంత సులువు కాదు. శరీరం బరువు పెరిగేందుకు ముఖ్య కారణం తినే ఆహారం విషయంలో కాస్త కఠినంగా ఉండక తప్పదు. అయితే బరువు తగ్గాలంటే సహకరించే వాటిలో డ్రైఫ్రూట్స్ ముందుంటాయి. అవేంటో చూద్దాం.
బాదం..
బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు,. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బాదం తక్కువ కేలరీల ఆహారం, ఇది బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇవి తినడం వల్ల పొట్ట చాలా సేపు నిండుగా ఉండడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గి బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా బాదంపప్పు సహకరిస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా జీడిపప్పులో ఉంటాయి. దీనిని తీసుకున్నప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. జీడిపప్పు ముఖ్యంగా ఎముకల బలానికి సహకరిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వాపును తగ్గించి ఆకలిని మందగించేలా చేస్తుంది. దీనితో పాటు బరువుకూడా తగ్గుతారు. జీడిపప్పులోని అధిక కేలరీలు పరిమితంగా విపరీత పరిణామాలను ఇవ్వకుండా జీడిపప్పును మితంగా తీసుకోవాలి.
ఇదికూడా చదవండి : ఈ అలవాట్లు ఉన్నాయా..? హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గాలంటే మార్చుకోవడమే బెటర్..!
వాల్నట్స్..
వాల్ నట్స్ వీటిని సూపర్ ఫుడ్ గా లెక్కిస్తారు. వీటితో శరీరానికి ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని షేక్స్ లోనూ, స్మూతీస్ లోను, సలాడ్స్ తో పాటు కలిపి కూడా తీసుకోవచ్చు.
పిస్తాపప్పు
తక్కువ కేలరీల పిస్తాలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందుకే పిస్తా బరువు తగ్గించే మంచి ఆహారం. దీన్ని స్నాక్‌గా తినవచ్చు. పిస్తాపప్పుల తినడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా రక్తంలో చక్కెరను తక్కువగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.