Pregnancy Doubts: ఈ నూనెను తాగితే గర్భవతులకు సమస్యేనా..? 9వ నెలలో తాగితే డెలివరీ వెంటనే అయిపోతుందా..?
ABN , First Publish Date - 2023-07-22T13:38:55+05:30 IST
కొన్నిసార్లు కాస్టర్ ఆయిల్ మరింత తీవ్రమైన, ప్రేగు కదలికకు కారణమవుతుంది.
ఇప్పటి కాలంలో గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకూ డాక్టర్స్ ఏం చెపితే అదే విధంగా ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పేది చేయాలన్నా కూడా కాస్త భయంగానే ఉంటుంది. ఇప్పటి రోజుల్లో ఏది వైద్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసినా కూడా అది వ్యతిరేకంగా మారుతుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది దాదాపుగా పాటించేవారు తక్కువే. అయితే పూర్వం ప్రసవం కావలసిన తేదీ గానీ దాటితే పెద్దవాళ్ళు చెప్పే సహజమైన పద్ధతులను పాటించేవారు. కానీ ఇప్పటి రోజుల్లో ప్రసవానికి ఇచ్చిన డైట్ దాటకుండానే డెలివరీలు చేస్తున్నారు. కానీ పూర్వం కాస్త గడువుదాటినా కూడా వేచి ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పిన విధంగా సహజమైన పద్ధతుల్లో ప్రసవం కావడానికి ప్రయత్నించేవాళ్ళు.
గర్భం దాల్చిన 9 నెలలకు కూడా ప్రసవ నొప్పి ప్రారంభం కాకపోతే, ఇంట్లోని పెద్దవారు సహజ పద్ధతులను సూచిస్తారు. ప్రసవాన్ని ప్రేరేపించడానికి గర్భిణీ స్త్రీలను ఆముదం తాగమని చెబుతారు. ఇది సంకోచాలను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ. ఒక నివేదిక ప్రకారం, మహిళలు గర్భం దాల్చిన తొమ్మిదవ నెలలో ఆముదం తీసుకుంటే, త్వరగా ప్రసవం జరుగుతుందట. అంటే ఆముదం తీసుకున్న తర్వాత, స్త్రీకి ఒకటి లేదా రెండు రోజుల పాటు ప్రసవ సమయంలో నొప్పి మొదలవుతుంది. సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే దీనికి ఇంకా శాస్త్రీయ కారణాలు లేవు.
ఆముదం తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
ప్రసవ నొప్పిని పెంచడానికి ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇది డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌కు భంగం కలిగిస్తుంది. జీర్ణకోశ బాధ కలిగించవచ్చు. ఇది మెకోనియం స్టెయినింగ్‌కు కూడా కారణమవుతుంది. కొన్నిసార్లు కాస్టర్ ఆయిల్ మరింత తీవ్రమైన, ప్రేగు కదలికకు కారణమవుతుంది. దీంతో తల్లీబిడ్డను కాపాడేందుకు వైద్యుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఇది ఎలా పని చేస్తుంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమైన పరిశోధనలో ఆముదంలో రిసినోలెయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ప్రేగులు, గర్భాశయంలోని ప్రోస్టాగ్లాండిన్ గ్రాహకాల సంకోచాన్ని పెంచుతుందని తేలింది.
ఇది కూడా చదవండి: ఎన్ని లీటర్ల మంచి నీళ్లు తాగినా తీరని దప్పిక.. అనుమానంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. టెస్టుల్లో బయటపడ్డ నిజమేంటో విని..!
కాస్టర్ ఆయిల్ ఎలా ఉపయోగించవచ్చు.
9 నెలల్లో, మహిళలు ఆహారంలో ఆముదం ఉపయోగించవచ్చు. నీటిలో ఆముదం కలపడం ద్వారా ఉపయోగించాలి. గర్భిణీ స్త్రీలు పడుకునే ముందు ఒక చెంచా ఆముదం నీటిలో లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు.
ఆముదం తీసుకునే ముందు..
ప్రసవ నొప్పిని పెంచడానికి ఆముదం సహజ పద్ధతిని ఉపయోగించడాన్ని పరిశీలిస్తే, ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.