Benefits of Jaggery: చలికాలంలో బెల్లం తింటే 10 ఆరోగ్య ప్రయోజనాలు.. !!
ABN , Publish Date - Dec 16 , 2023 | 05:22 PM
రోజువారీబెల్లం తీసుకోవడం వల్ల రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
బెల్లం శరీరం జీర్ణకు సహకరిస్తుంది. ప్రేగు కదలికను పెంచి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. చాలా మంది రోజూ చిన్న బెల్లం ముక్కను తినడానికి ఇష్టపడతారు. దీనితో ఎన్ని ఉపయోగాలంటే..
బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు...
1. బెల్లం శరీరానికి వేడి చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రత్యేకించి ఈ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
2. ఇందులో ఐరెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
3. కట్టెలపై ఇనుప కడాయిలో తయారుచేసిన, మన చేతితో సహజంగా తయారు చేసిన చెరకు బెల్లం పిల్లలు, వృద్ధులు కూడా ఇది సులభంగా జీర్ణం అవుతుంది.
కాలేయం పనితీరును నియంత్రిస్తుంది.
బెల్లం శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
ఫ్లూ-వంటి లక్షణాల చికిత్సలో..
చాలా మంది చలికాలంలో బెల్లం తీసుకుంటారు, ఎందుకంటే ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. జలుబు, దగ్గు లేదా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు బెల్లం ముక్కను తీసుకోవాలనేదానికి ఒక ప్రధాన కారణం ఇదే..
రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
రోజువారీబెల్లం తీసుకోవడం వల్ల రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: పిల్లల్లో శీతాకాలం వచ్చే ఫుడ్ అలెర్జీలను ఎలా నివారించాలి..!
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బెల్లం అన్ని మంచి ఖనిజాలు, సెలీనియం, జింక్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అవి మీ కణాలకు ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారిస్తాయి.
పిరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది.
పీరియడ్స్ వచ్చే ముందు రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల PMS లక్షణాల నుండి ఉపశమనం పొందుతుంది. మూడ్ స్వింగ్స్ కారణంగా నిరుత్సాహంగా ఉన్నట్లయితే, చిన్న బెల్లం ముక్కను మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.