Share News

e-cigarettes: ఇ-సిగరెట్స్ ఆరోగ్యానికి ప్రమాదమా..? వీటిని తాగితే ఆరోగ్యంపై ఎలాంటి హానికలుగుతుందంటే..!!

ABN , Publish Date - Dec 15 , 2023 | 01:08 PM

E-సిగరెట్స్ లలో ఎరోసోల్ డయాసిటైల్ వంటి హానికరమైన రసాయనాలుంటాయి.

e-cigarettes: ఇ-సిగరెట్స్ ఆరోగ్యానికి ప్రమాదమా..? వీటిని తాగితే ఆరోగ్యంపై ఎలాంటి హానికలుగుతుందంటే..!!
e-cigarettes

సిగరెట్స్ ప్రమాదకరమైనవని హైలైట్ చేస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రభుత్వాలు వాటిని పొగాకు మాదిరిగానే పరిగణించాలని నిర్ణయించాయి. అలాగే వీటిని నిషేదించాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇ-సిగరెట్ వాడకం ధూమపానం మానేయడంలో సహాయపడింది. ఇది పిల్లల్లో, యువకుల్లో నికోటిన్ వ్యసనానికి దారితీస్తాయని WHO తెలిపింది.

ఈ ఇ-సిగరెట్లలో విషపూరిత పదార్థాలున్నాయి. ఇవి క్యాన్సర్ కు కారణమవుతాయి. గుండె, ఊపిరితిత్తుల రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి. గర్భిణీ స్త్రీలలో పిండం అభివృద్ధిని కూడా ప్రతికూలంగా మారుస్తాయి.

దీనితో కలిగే హాని ఎలా ఉంటుందంటే..

నికోటిన్ డిపెండెన్స్: ఇ-సిగరెట్స్‌లో మామూలు సిగరెట్‌లలో కనిపించే నికోటినే ఉంటుంది. కానీ దీనిని ఒకసారి అలవాటు పడ్డాకా వదిలేయడం అనేది సాధ్యం కాదు.

మెదడు అభివృద్ధి: నికోటిన్ ముఖ్యంగా యుక్తవయసు పిల్లలు, యువకుల్లో మెదడుకు హాని కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి మీద, కంటి చూపు మీద ప్రభావాన్ని చూపుతుంది.

ఊపిరితిత్తుల నష్టం: ఊపిరితిత్తుల గాయం, వాపు, మచ్చలు, మరణానికి కారణమవుతుంది. దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అలసట, ఛాతీ నొప్పి, వంటి లక్షణాలుంటాయి.


ఇది కూడా చదవండి: వేసవిలో మాత్రమే కాదు, శీతాకాలంలోనూ చర్మానికి సన్‌స్ర్కీన్ తప్పనిసరి..దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!

దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు: E-సిగరెట్స్ లలో ఎరోసోల్ డయాసిటైల్ వంటి హానికరమైన రసాయనాలుంటాయి. ఇవి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి అయిన బ్రోన్కియోలిటిస్, అబ్లిటెరాన్స్ తో ముడిపడి ఉంటుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల పరిస్థితులను కూడా తీవ్రతరం చేస్తుంది.

కార్డియో వాస్కులర్ వ్యాధి; E- సిగరెట్లు గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తాయి. గుండె స్ట్రోక్ ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

మానసిక ఆరోగ్యం: నికోటిన్ వాడకం ఆందోళన, నిరాశ లక్షణాలను పెంచుతుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 01:08 PM