Share News

Benefits of sunscreen: వేసవిలో మాత్రమే కాదు, శీతాకాలంలోనూ చర్మానికి సన్‌స్ర్కీన్ తప్పనిసరి..దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!

ABN , Publish Date - Dec 15 , 2023 | 12:50 PM

సవిలో ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే 80% UV కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎక్కువగా సన్ స్క్రీన్ ను వాడుతూ ఉంటాం.

Benefits of sunscreen: వేసవిలో మాత్రమే కాదు, శీతాకాలంలోనూ చర్మానికి సన్‌స్ర్కీన్ తప్పనిసరి..దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!
sunscreen

సన్ స్క్రీన్ చర్మానికి కాంతిని ఇచ్చి వేసవిలో వేడి నుంచి, చెమట, చిరాకు నుంచి సన్ స్క్రీన్ కాపాడుతుంది. మంచి ఎండలో బయటకు వెళ్ళాలన్నా భయపడుతూనే ఉంటాం. వేసవిలో ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే 80% UV కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎక్కువగా సన్ స్క్రీన్ ను వాడుతూ ఉంటాం. అయితే ఒక్క వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా చర్మానికి సన్ స్క్రీన్ వాడటం మంచిదట.. వివరాల్లోకి వెళితే..

ఏకాలమైనా సన్ స్క్రీన్ అప్లై చేయండి..

ఆరుబయట ఉన్నా, ఇంటి లోపల ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా చర్మానికి సన్ స్క్రీన్ పూయడం ముఖ్యం. ఎందుకంటే బయటి కాలుష్యం మూలంగా చర్మం నవ యవ్వనాన్ని కోల్పోతుంది. అందుకోసం ఇది అకాల వృద్ధాప్యం, చర్మ క్యాన్సర్ వంటి ఆందోళలను తొలగిస్తుంది.

సన్ స్క్రీన్ తో మరో ప్రయోజనం ఏంటంటే..

అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. UV కిరణాలకు ఎక్కువ కాలం బహిర్గతం కాకపోవడం వల్ల చర్మ నిగారింపుతో ఉంటుంది.


ఇది కూడా చదవండి: ఈ మూలికలతో మగవారిలో ఎంత సత్తువ వస్తుందంటే..!! ట్రై చేసి చూడండి..

స్కిన్ టోన్ ను మెయింటెన్ చేస్తుంది.

సన్ స్క్రీన్ ప్రయోజనాల గురించి టానింగ్ రంగు, పాలిపోడాన్ని నిరోధిస్తుంది. మృదువైన స్కిన్ టోన్ ను అందిస్తుంది.

చర్మ క్యాన్సర్ ను నివారిస్తుంది.

UV కిరణాలను ఎక్కువసేపు బహిర్గతం చేయడం వల్ల చర్మ క్యాన్సర్ దారితీయవచ్చు. కాబట్టి ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే సన్ స్క్రీన్ తో రక్షించుకోవడం ఉత్తమం. సన్ బర్న్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ముడతలు, క్యాన్సర్ నుంచి వచ్చే UV కిరణాల హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

Updated Date - Dec 15 , 2023 | 12:50 PM