Eggs Side Effects: గుడ్లు తింటే కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని కలలో కూడా ఊహించి ఉండరు..!

ABN , First Publish Date - 2023-08-28T15:05:24+05:30 IST

ముఖ్యంగా కోడిగుడ్డు పచ్చసొనను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కొవ్వు పచ్చసొనలో కనిపిస్తుంది.

Eggs Side Effects: గుడ్లు తింటే కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని కలలో కూడా ఊహించి ఉండరు..!
health problems.

రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు పాలు, ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్స్ ఇటు పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. గుడ్డులో అనేక పోషకాలున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు, ఐరెన్ లభిస్తాయి. గుడ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయి. కానీ ఎక్కువ గుడ్లు తినడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయట. వీటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ సమస్య

కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే, గుడ్లు తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. గుడ్లు ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణవ్యవస్థకు హానికరం

ఎక్కువగా గుడ్లు తింటే, జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. కడుపు నొప్పితో ఇబ్బంది పడవచ్చు. కొందరికి గుడ్లు తింటే ఎలర్జీ కూడా ఉంటుంది.

బరువు పెరగవచ్చు.

ముఖ్యంగా కోడిగుడ్డు పచ్చసొనను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. నిజానికి, కొవ్వు పచ్చసొనలో కనిపిస్తుంది.

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. గుడ్లలో పెద్ద మొత్తంలో జింక్ అలాగే విటమిన్లు B6, B12 ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, తద్వారా ఫ్లూ, జలుబును నివారించవచ్చు.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా టీ తాగేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు.. వీటిని కలుపుకుని తింటే..!


2. గుడ్డు విటమిన్ డి మంచి మూలం, ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.

3. గుడ్డు పచ్చసొన లేదా ఉడకబెట్టిన గుడ్లలోని పసుపు భాగంలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కళ్లను కాపాడతాయి.

4. గుడ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

Updated Date - 2023-08-28T15:40:08+05:30 IST