After A Meal: భోజనం తర్వాత చాలామందికి ఎందుకిలా ఇబ్బందిగా అనిపిస్తుందో తెలిసిపోయింది..!

ABN , First Publish Date - 2023-02-14T11:44:00+05:30 IST

భోజనం చేసిన తర్వాత.. మనకు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇవాళ ఎక్కువగా తినేశామనో.. లేదంటే సరిపడా తినలేదనో ఫీలవుతుంటాం. అలాంటప్పుడే మనం కొంత ఎసిడిటీ లేదంటే భారంగా.. అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటాం. అయితే అలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

After A Meal: భోజనం తర్వాత చాలామందికి ఎందుకిలా ఇబ్బందిగా అనిపిస్తుందో తెలిసిపోయింది..!

భోజనం చేసిన తర్వాత.. మనకు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇవాళ ఎక్కువగా తినేశామనో.. లేదంటే సరిపడా తినలేదనో ఫీలవుతుంటాం. అలాంటప్పుడే మనం కొంత ఎసిడిటీ లేదంటే భారంగా.. అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటాం. అయితే అలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? భోజనం తర్వాత చాలామందికి ఎందుకిలా ఇబ్బందిగా అనిపిస్తుందో తాజా అధ్యయనాల్లో తేలిపోయింది. అది తక్కువ గట్ మొబిలిటీ కారణంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గట్‌లో ఆహారం కదలిక.. అలాగే పెరిస్టాల్టిక్ మూమెంట్ కారణంగా జరుగుతుంది. ఇది మన జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యపై డైటీషియన్లు ఏమంటున్నారంటే..

మన డైజెస్టివ్ కెనాల్ లైన్ చేసే కండరాల వేవ్ మూమెంట్‌ను పెరిస్టాల్సిస్ అంటారు. ఇది మన గొంతులో ప్రారంభమవుతుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయినప్పుడు అది అన్నవాహిక, కడుపు, పేగుల గుండా ప్రయాణించి యానస్ ద్వారా బయటకు వెళుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం, ద్రవాలను తీసుకువెళ్లే బాధ్యతను పెరిస్టాల్సిస్ తీసుకుంటుందని.. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. అయితే పెరిస్టాల్సిస్.. జీర్ణక్రియకు ఎక్కువ సమయం తీసుకుంటే మనం ఆహారం తీసుకున్న మీదట ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డైటీషియన్స్ చెబుతున్నారు.

జీర్ణక్రియను వేగవంతం చేసుకోవాలంటే ఏం చేయాలి?

ఇకపై కదలకుండా ఒకే చోట కూర్చోవడం వంటి పనులకు స్వస్తి చెప్పాలి. వ్యాయామానికి తగినంత సమయం కేటాయించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, పాల పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఆవు లేదంటే గేదె పాలకు బదులుగా బాదం లేదా సోయా పాలను తీసుకోవడం ఉత్తమం. ఫైబర్ ఉన్న ఆహారం, రిచ్ ఫుడ్స్.. పుష్కలంగా నీరు తీసుకుంటే చాలు.. ఇబ్బందంతా ఎగిరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

  • ఇక భోజనం చేసే సమయంలో ఎలా పడితే అలా కూర్చోకూడదు. సుఖాసనంలో నిటారుగా కూర్చోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు.. రక్త ప్రసరణను సైతం మెరుగు పరుస్తుంది.

  • రోజూ ఒకే సమయంలో భోజనం చేయండి.

  • మన ఆహారంలో ఎక్కువగా లవంగం, వాము ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పేగులలో మంటను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను పెంచుతుంది.

  • చేసుకునే వంటల్లో కూడా ఇంగువను ఎక్కువగా వాడాలి. అది కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.

  • ఉదయాన్నే ధనియాలను నీటిలో మరిగించుకుని తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

  • మనం తీసుకునే భోజనంతో పాటు రోజుకు ఒకసారి సలాడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి.

  • ఇక చివరిగా ప్రతి రోజూ కనీసం 30-45 నిమిషాలు నడక అలవాటు చేసుకోండి.

Updated Date - 2023-02-14T12:04:20+05:30 IST