Share News

Sleep quality: నిద్ర సరిగా లేకపోతే ఆ ప్రభావం సంతానోత్పత్తి మీద పడుతుందా? నిద్ర నాణ్యతను పెంచే ఆరు చిట్కాలు ఇవే..!

ABN , Publish Date - Dec 16 , 2023 | 04:07 PM

కనీసం 30 నిమిషాల పాటు నడవడం, సాధారణ కార్యక్రమంలా పెట్టుకోవాలి.

Sleep quality: నిద్ర సరిగా లేకపోతే ఆ ప్రభావం సంతానోత్పత్తి మీద పడుతుందా? నిద్ర నాణ్యతను పెంచే ఆరు చిట్కాలు ఇవే..!
sleep patterns

కొత్తగా వివాహం అయిన జంటల్లో సంతానలేమి కాస్త ఎక్కువగానే ఈమధ్య ఇప్పటి రోజుల్లో కనిపిస్తుంది. ఎప్పుడైనా నిద్ర సరిగా లేకపోవడం కూడా సంతానోత్పత్తి విషయంలో ప్రభావం చూపుతుందని అనుకున్నారా? కానీ ఇది కూడా చాలా వరకూ కారణమట. అయితే ఈ సమస్యను సరిచేయడానికి నాణ్యమైన నిద్రను మెరుగుపరచడానికి ఈ ఆరు చిట్కాలు పాటిస్తే చాలు.

జీవనశైలి అలవాట్లు కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. తక్కువ బరువు లేదా అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, మద్యపానం, వ్యాయామానికి దూరంగా ఉండటం వలన గర్భం దాల్చే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కానీ దీనికి నిద్ర కూడా ఓ కారణంగా నిలుస్తుంది. దీనిని అధిగమించాలంటే మాత్రం జీవనశైలి మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

దీర్ఘకాలిక నిద్ర లేమి తరచుగా ఒత్తిడి ఆందోళన, వంధ్యత్వానికి కారణం అవచ్చు. తగినంత నిద్రలేకపోవడం వల్ల మగ, ఆడ ఇద్దరిలోనూ సంతానలేమి సమస్య కనిపిస్తుంది.. తగినంత విశ్రాంతి లేకపోతే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది సంతానోత్పత్తికి ఆటంకాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను పెంచుతుంది. హైపోథాలమిక్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ యాక్టివేట్ చేయడం వల్ల నిద్ర భంగం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది ఒత్తడికి కారణమై గర్భస్రావాల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: మెరుగైన జీర్ణక్రియ కోసం జపనీస్ వాటర్ థెరపీ దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!


నిద్రలేమిని దాటాలంటే.. చిట్కాలు..

1. హృదయ స్పందన రేటును తాత్కాలికంగా పెంచే ఎరోబిక్ వ్యాయామాలను ఎంచుకోవాలి.

2. కనీసం 30 నిమిషాల పాటు నడవడం, సాధారణ కార్యక్రమంలా పెట్టుకోవాలి.

3. స్థిరమైన నిద్రకు షెడ్యూల్ వేయండి. ప్రత్యేకించి గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని మేల్కోవాలి.


4. పడకగదిని చీకటిగా, చల్లగా ఉంచడం నిద్రకు అనువైనదిగా గది వాతావరణాన్ని సృష్టించుకోవాలి.

5. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

6. నిద్రవేళకు కనీసం ఏడు గంటల ముందు ఆల్కహాల్ లేదా కెఫిన్ తీసుకోవడం మానుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 04:07 PM