Share News

Weight loss : మెరుగైన జీర్ణక్రియ కోసం జపనీస్ వాటర్ థెరపీ దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!

ABN , Publish Date - Dec 15 , 2023 | 03:24 PM

ఇది ఒక పురాతనమైన ఆచారంగా వస్తున్న, జపనీస్ వాటర్ థెరపీ. దీనితో మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా వరకూ తేలికగా బరువు తగ్గే వీలుంటుంది.

Weight loss : మెరుగైన జీర్ణక్రియ కోసం జపనీస్ వాటర్ థెరపీ దీనితో ఎన్ని ప్రయోజనాలంటే..!!
temperature water

భారీగా బరువు పెరిగిపోయాం అనుకునేవారు, అధిక బరువును తగ్గించుకోవాలనుకునేవారు కూడా ఈ మధ్య కాలంలో చాలా రకాల డైట్స్ ఫాలో అవుతున్నారు. అయితే వీటితో ఫలితాలు ఎలా ఉన్నాయనేది పాటించే వారిని బట్టి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా వింటున్న డైట్ ఫ్లాన్ జపనీస్ వాటర్ థెరపీ.. దీనిగురించి వివరంగా తెలుసుకుందాం.

ఇది ఒక పురాతనమైన ఆచారం, జపనీస్ వాటర్ థెరపీ. దీనితో మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా వరకూ తేలికగా బరువు తగ్గే వీలుంటుంది.

జపనీస్ వాటర్ థెరపీ ఎలా పనిచేస్తుంది.

దీనిని ఆచరించడం చాలా తేలిక. ఈ పద్దతిలో ఏం చేయాలంటే.. ఉదయాన్నే నిద్రలేవగానే వేరే పనులు చేసే బదులు 160 నుంచి 200 ఉష్ణోగ్రతతో ఉన్న నీటిని త్రాగాలి.

నీరు తాగిన తర్వాత

క్రమం తప్పకుండా నోటి పరిశుభ్రత పాటించాలి. పళ్ళు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి.

తినే ముందు..

నీటిని తీసుకున్న తర్వాత ఆహారం, పానీయాలు వంటివి తీసుకున్న తర్వాత కనీసం 45 నిమిషాలు పాటు ఆగాలి. ఇది శరీరాన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది.


భోజనం విషయంలో..

భోజనం విషయానికి వస్తే.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా నమలడం, జీర్ణక్రియ సరిగా ఉండాలంటే భోజనం తీసుకునే సమయంలో ఎక్కువ నీరు తాగకుండా ఉండాలి.

ఈ జపనీస్ వాటర్ థెరపీతో ప్రయోజనాలేంటి?

మెరుగైన జీర్ణక్రియ.. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు, క్రమబద్దంగా ఉంచేందుకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే నీరు ఆహారాన్ని విచ్చిన్నం చేయడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహకరిస్తుంది.

బరువు తగ్గడం: నీళ్ళు క్రమం తప్పకుండా ఒకే సమయంలో పరిమిత మోతాదులో తీసుకుంటూ ఉంటే కేలరీలు తగ్గించడంలో సహాయపడుంది. నీరు పొట్టలోని ఖాళీని తీసుకుని ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ని ఇస్తుంది.


మెరుగైన చర్మ ఆరోగ్యం: నీరు పుష్కలంగా త్రాగడం వల్ల చర్మ హైడ్రేట్ అవుతుంది. ఆరోగ్యంగా మెరుస్తుంది.

శక్తి స్థాయిలు; సరిగా శరీరానికి నీరు తీసుకోకపోతే అది అలసటకు దారితీస్తుంది. నీరు తగినంత తాగడం వల్ల అది శరీరం శక్తి స్థాయిలను మెరుగుపరిచేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి; ఇ-సిగరెట్స్ ఆరోగ్యానికి ప్రమాదమా..? వీటిని తాగితే ఆరోగ్యంపై ఎలాంటి హానికలుగుతుందంటే..!!

మూత్రపిండాలలో రాళ్ళు..

నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే ఇదే డైట్ మరీ ఓవర్ హైడ్రేషన్ కు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. దీనితో తలనొప్పి, వికారం, మైకం వంటివి కలుగుతాయి.

Updated Date - Dec 15 , 2023 | 03:24 PM