Brown Sugar vs White Sugar: ఈ రెండు చక్కెరల్లో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!!
ABN , Publish Date - Dec 18 , 2023 | 05:09 PM
బ్రౌన్ షుగర్ పిరియడ్స్ ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారికి తెల్లని పంచదార, కాస్త రంగు మారి ఉండే బ్రౌన్ షుగర్ ఈ రెండిటి గురించి తెలిసే ఉంటుంది. తెలుపు, గోధుమ రంగుల చక్కెర ఏమిటో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఏది ప్రయోజనకరమే కూడా తెలుసుకుందాం.
తెలుపు, గోధుమ రంగు చక్కెరలో మధ్య వ్యత్యాసం..
తెల్ల చక్కెర, బ్రౌన్ షుగర్ రెండు చెరకు రసం నుండి తయారు చేసేవే. రెండు చక్కెరలను తయారుచేసే విధానం కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. రెండిటి మధ్యా వ్యత్యాసం ఏంటంటే.. గోధుమ రంగు చక్కెర తక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. అదే తెల్లని చక్కెర తయారీకి మాత్రం సిరప్ ను తొలగించే విధానంలో శుద్దీకరణ ప్రక్రియ మొదలవుతుంది. దీనితో ఈ చక్కెరకు తెలుపు రంగు వస్తుంది.
అలాగే వీటి రుచులలోనూ తేడా ఉంటుంది. స్వీట్లు, కేకులు తయారీలో తెల్ల చక్కెరను విరివిగా వాడతారు. బ్రౌన్ షుగర్ రుచి వేరుగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తెల్లని చక్కెర బరువును పెంచుతుంది. తెల్లచక్కెర తయారీలో సల్ఫర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
వీటితో ప్రయోజనాలేంటంటే...
బరువు తగ్గాలంటే.. బ్రౌన్ షుగర్ బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తెల్ల చక్కెర కంటే చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈ సీజన్‌లో వచ్చే సీతాఫలంతో ఎన్ని లాభాలంటే.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట..!!
జీర్ణక్రియను..
బ్రౌన్ షుగర్ లో అనేక పోషకాలున్నాయి. విటమిన్ బి, ఐరెన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలున్నాయి. దీని తయారీకి రసాయనాలు ఉపయోగించరు.
పిరియడ్స్ ఇబ్బందులు..
బ్రౌన్ షుగర్ పిరియడ్స్ ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. పిరియడ్స్ సమయంలో నీటిని మరిగించి, ఒక చెంచా బ్రౌన్ షుగర్ కలిపి తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
చర్మాన్ని కాంతి వంతంగా..
చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉన్న మచ్చలను, మురికిని తొలగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.