Anti Aging Foods: 35 ఏళ్ల వయసు దాటిందా..? ముఖంపై ముడతలు స్టార్ట్ అయ్యాయా..? వీటిని తినడం మొదలు పెట్టేయండి..!

ABN , First Publish Date - 2023-09-07T10:20:00+05:30 IST

ఉసిరిలో విటమిన్ సి లభిస్తుంది. దీంతో ముఖం బిగుతుగా మారి చర్మం మెరుస్తుంది.

Anti Aging Foods: 35 ఏళ్ల వయసు దాటిందా..? ముఖంపై ముడతలు స్టార్ట్ అయ్యాయా..? వీటిని తినడం మొదలు పెట్టేయండి..!
remove wrinkles.

ప్రతి ఒక్కరిలోనూ ఒక వయస్సు తర్వాత, ముఖం వదులుగా కనిపించడం మొదలవుతుంది. ముఖంలో ఈ ముడతలు కనిపించడం మొదలవగానే ముసలితనంతో వృద్ధాప్యంతో కనిపించడం ప్రారంభిస్తారు. కానీ ఇది వయస్సు కంటే ముందే జరిగితే, ఇలాంటి పరిస్థితి ప్రతి మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే కాన్పుతర్వాత, మోనోపాజ్ కి ముందే ఈ సమస్య కనిపిస్తే దానికి చిట్కాలతో దాటేయచ్చు. స్త్రీలు 35 ఏళ్లు దాటిన తర్వాత వీటిని తీసుకుంటే వృద్ధాప్యం దరిచేరదు. అదెలాగంటే..

వృద్ధాప్యాన్ని దరిచేరనీయని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏవంటే..

బెర్రీలు

వృద్ధాప్యాన్ని తగ్గించడానికి బెర్రీలు చాలా మంచి ఆహారం. ఇందులోని ఫైబర్ విటమిన్లు వంటి పోషకాలు చర్మానికి మెరునిస్తాయి.

గింజలు

గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీన్ని రోజూ ఉదయం తినడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. పైగా ముడతలు రాకుండా ఉంటాయి.

డార్క్ చాక్లెట్

ముఖంలో ముడతలు, మొటిమలను తొలగించేందుకు డార్క్ చాక్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. సాధారణ చాక్లెట్‌తో పోలిస్తే, 50 నుండి 90 శాతం ఎక్కువ కోకా బటర్, చక్కెర ఉంటాయి. ఇది వృద్ధాప్య సమస్యను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: నెలసరిని మందులతో వాయిదా వేస్తున్న అమ్మాయిలు.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలేంటంటే..!


ఉసిరి

ఉసిరిలో విటమిన్ సి లభిస్తుంది. దీంతో ముఖం బిగుతుగా మారి చర్మం మెరుస్తుంది. ముఖంపై మచ్చలను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మృతకణాలను కూడా తొలగిస్తుంది.

గ్రీన్ టీ

ముఖం హైడ్రేట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా గ్రీన్ టీ తాగాలి. దీనిని తీసుకోవడం వల్ల ముఖంలో తేమ అలాగే ఉంటుంది. ఇది వయస్సు కంటే ముందు మీ ముఖంలో వృద్ధాప్యం కనిపించనివ్వదు. గ్రీన్ టీ బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

Updated Date - 2023-09-07T10:20:00+05:30 IST