Viral Video: పారిశుధ్య కార్మికులకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే బంధువు తుపాకీతో బెదిరింపులు వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-04-17T16:11:08+05:30 IST

మహేష్ పటేల్ ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి పైఅంతస్తు నుంచి తుపాకీ చూపుతూ(..

Viral Video: పారిశుధ్య కార్మికులకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే బంధువు తుపాకీతో బెదిరింపులు వీడియో వైరల్

మధ్యప్రదేశ్: ఇండోర్(Indore)లో రెచ్చిపోయిన ఓ వ్యాపారి(Businessman), బీజేపీ మాజీ ఎమ్మెల్యే బంధువు(Relative of ex-BJP MLA) పారిశుధ్య కార్మికులపై(Sanitation Workers) కాల్పులు జరిపాడు. భయంతో పరుగులు పెట్టిన పారిశుధ్య కార్మికులు పోలీసులను ఆశ్రయించారు.

చెత్త(Garbage)విషయంలో గొడవపడి ఇండోర్‌కు చెందిన పెట్రోల్ పంప్ యజమాని, బీజేపీ మాజీ ఎమ్మెల్యే బంధువు మహేష్ పటేల్ తమను చంపేస్తానని బెదిరించారని స్థానిక పారిశుధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

శనివారం పారిశుధ్య కార్మికులు మహేష్ పటేల్ ఇంటి వెలుపల చెత్తను సేకరించే సమయంలో పొడి, తడి చెత్త విషయంలోపటేల్ భార్య, పారిశుధ్య కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. మహేష్ పటేల్ ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి పైఅంతస్తు నుంచి తుపాకీ చూపుతూ(Brandishing a Gun) పారిశుధ్య కార్మికులను బెదిరించాడు. కొద్దిసేపటికే కిందికి దిగి తుపాకీ గురిపెట్టాడు. దీంతో పారిశుధ్య కార్మికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

ఈ వీడియోలో మహేష్ పటేల్, అతని కుమారుడు పారిశుధ్య కార్మికులపట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బండబూతులు తిట్టారు. పారిశుధ్య కార్మికులపై తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించాడు. అతని కొడుకు వారిని సజీవంగా పాతిపెడతానని బెదిరించాడు.

విషయం తెలిసిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి ఇరువర్గాల మధ్య అవగాహన కుదిర్చారు. అయితే విషయం అక్కడితో ముగియలేదు. చెత్త వ్యాన్‌లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బిజెపి మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.

Updated Date - 2023-04-17T16:15:50+05:30 IST