Viral News: పేలిన సెల్‌ఫోన్, చిన్నారి మృతి

ABN , First Publish Date - 2023-04-25T19:01:41+05:30 IST

సెల్‌ఫోన్(Cell Phone) ఓ చిన్నారిని బలిగొంది. వీడియాలు చూస్తుండగా ఒక్కసారిగా ఒక్కసారిగా సెల్‌ఫోన్ పేలడంతో..

Viral News: పేలిన సెల్‌ఫోన్, చిన్నారి మృతి

కేరళ: సెల్‌ఫోన్(Cell Phone) ఓ చిన్నారిని బలిగొంది. వీడియాలు చూస్తుండగా ఒక్కసారిగా ఒక్కసారిగా సెల్‌ఫోన్ పేలడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. త్రిస్సూర్‌(Thrissur)లోని పత్తిపరంబు(Pattiparambu)కు చెందిన ఆదిత్యశ్రీ (Adithyasree)(8) మొబైల్ ఫోన్ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదిత్యశ్రీ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుడి చేతి వేళ్లు తెగిపోయాయి, పేలుడులో ఆమె అరచేయి విరిగిపోయాయి. విగత జీవిగా మారిన చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాగా మృతురాలు ఆదిత్యశ్రీ తిరువిల్వామల(Thiruvilwamala)లోని క్రైస్ట్ న్యూ లైఫ్ స్కూల్‌(Christ New Life School)లో 3వ తరగతి చదువుతోంది. ఛార్జింగ్ పెట్టి ఉంచిన ఫోన్ ‌లో ఆదిత్యశ్రీ వీడియోలు చూస్తుండగా.. ఫోన్ వేడెక్కడంతో పేలుడు సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది.

చాలామంది తరచుగా ఫోన్ల విషయంలో చాలా తప్పులు చేస్తుంటారు. అది పేలుడుకు కారణమవుతుంది. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించడం వల్ల మదర్‌బోర్డుపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని వల్ల ఫోన్ సర్క్యూట్ ఓవర్ హీట్ అవుతుంది. ఈ వేడితో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోన్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉందింటున్నారు సాంకేతిక నిపుణులు.

Updated Date - 2023-04-25T19:02:55+05:30 IST