Vijayendra: మా ఎమ్మెల్యేలెవరూ పార్టీ వీడరు: విజయేంద్ర
ABN , First Publish Date - 2023-11-21T11:36:10+05:30 IST
బీజేపీ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరని, భవిష్యత్తులో ఇతర పార్టీలకు చెందినవారు తమతో కలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BY Vijayendra)

బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరని, భవిష్యత్తులో ఇతర పార్టీలకు చెందినవారు తమతో కలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BY Vijayendra) విశ్వాసం వ్యక్తం చేశారు. మైసూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అందరితో కలసి పనిచేస్తానన్నారు. బీజేపీకి చెందినవారెవ్వరూ పార్టీ వీడే ఆలోచనలో లేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో సీనియర్ నేతలు బసనగౌడ పాటిల్ యత్నాళ్, రమేశ్ జార్కిహొళి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని, ఇందులో తప్పేమీ లేదన్నారు. త్వరలోనే యత్నాళ్, రమేశ్ జార్కిహొళిని కలుస్తానని తెలిపారు. వారి అభిప్రాయాలను తీసుకుని పనిచేస్తానన్నారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు ఉండవని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రె్‌సలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తాను అధిష్టించాలని డీకే శివకుమార్ భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సిద్దరామయ్య ఎక్కువమంది డీసీఎంలను నియమించుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు చేయడం సరికాదన్నారు.