Share News

Vande Bharat Train: కోవై-బెంగుళూరు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌

ABN , Publish Date - Dec 28 , 2023 | 08:11 AM

కోయంబత్తూర్‌-బెంగుళూరు(Koimbatore-Bangalore) మధ్య వందే భారత్‌ ట్రయల్‌ రన్‌ బుధవారం ఉదయం నిర్వహించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకంలో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్నాయి.

Vande Bharat Train: కోవై-బెంగుళూరు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌

పెరంబూర్‌(చెన్నై): కోయంబత్తూర్‌-బెంగుళూరు(Koimbatore-Bangalore) మధ్య వందే భారత్‌ ట్రయల్‌ రన్‌ బుధవారం ఉదయం నిర్వహించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకంలో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో చెన్నై-కోయంబత్తూర్‌, చెన్నై-తిరునల్వేలి, చెన్నై-మైసూర్‌ మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమల నగరాలైన కోవై-బెంగుళూరు మధ్య ఈ నెల 30వ తేది నుంచి వందే భారత్‌ రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో, కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు బెంగుళూరుకు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. తిరుప్పూర్‌, ఈరోడ్‌, ధర్మపురి, హోసూరు మీదుగా ఉదయం 11.30 గంటలకు బెంగుళూరు చేరుకున్న రైలు, మధ్యాహ్నం 1.40 గంటలకు బెంగుళూరులో బయల్దేరి రాత్రి 8 గంటలకు కోయంబత్తూర్‌ చేరుకుంది. ఈ రైళ్లకు ఒక ఏసీ, 7 సాధారణ అని మొత్తం 8 బోగీలున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 08:11 AM