Share News

US Visa: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అమెరికా.. ఎన్నంటే?

ABN , First Publish Date - 2023-11-29T09:52:57+05:30 IST

భారతీయులకు వీసాలు జారీ చేయడంలో అమెరికా రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా నిలిచింది.

US Visa: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అమెరికా.. ఎన్నంటే?

న్యూయార్క్: భారతీయులకు వీసాలు జారీ చేయడంలో అమెరికా రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా నిలిచింది. 2022లో ఇండియన్ స్టూడెంట్స్ కి 1,40,000 వీసాలు జారీ చేసింది.

దీనికి తోడు వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైంను తగ్గించడానికి యూఎస్ చర్యలు తీసుకుంటోంది. భారత్ తో దౌత్యపర సంబంధాలు పెంపొందించుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న కృషిలో భాగంగా వీసాల జారీలో ఇండియాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.


వీసా సేవలకు సంబంధించి యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ మాట్లాడుతూ.. భారత్‌లోని US వీసా మిషన్లు వారానికి ఆరు, ఏడు రోజులు పనిచేశాయని, విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే ముందు ఇంటర్వ్యూలు జరిగేలా చూశాయని తెలిపారు. ఈ ఏడాది సైతం భారత్ నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. "గతేడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను. తొలి సారిగా మిలియన్ వీసాలు జారీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. గతేడాదిలా పరిస్థితి కొనసాగితే ఈజీగా లక్ష్యాన్ని చేరుకుంటాం.

భారత్ లో దరఖాస్తు చేసుకున్న కార్మికులు, సిబ్బంది, విద్యార్థులు అమెరికా రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్స్ ని మేం ప్రత్యేకంగా చూస్తాం. ప్రస్తుతం అమెరికా వీసాలు అత్యధికంగా పొందిన దేశంగా భారత్ నిలిచింది. స్టూడెంట్స్ కి కొన్ని సార్లు ఇంటర్వ్యూలు జరపకుండానే వీసాలు జారీ చేశాం. దానికితోడు ఇరు దేశాల మధ్య దౌత్యపర సంబంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నాం. అమెరికా రావాలని ఆసక్తి ఉన్న వారెవరైనా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ స్టూడెంట్స్ కి ఉన్న నైపుణ్యాలు అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. 2023లో ఇప్పటివరకు US 10.5 మిలియన్లకు పైగా వీసాలను జారీ చేసింది, ఇది నేను ఊహించిన దానికంటే 2 మిలియన్లు ఎక్కువ" అని జూలీ తెలిపారు.

Updated Date - 2023-11-29T09:53:00+05:30 IST