Budget 2023 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మల సీతారామన్ భేటీ

ABN , First Publish Date - 2023-02-01T10:03:10+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి,

Budget 2023 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మల సీతారామన్ భేటీ
Draupadi Murmu, Nirmala Sitharaman

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) మరికాసేపట్లో పార్లమెంటుకు సమర్పించబోతున్నారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu)తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితోపాటు కేంద్ర మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నిర్మల సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను డిజిటల్ డివైస్‌తో పార్లమెంటులో ప్రవేశపెడతారు. కాగితం రహిత విధానంలో బడ్జెట్‌ను ప్రతిపాదించడం ఇది మూడోసారి. రాష్ట్రపతి భవన్ నుంచి నిర్మల సీతారామన్ కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదిస్తారు. అనంతరం పార్లమెంటుకు సమర్పిస్తారు.

Updated Date - 2023-02-01T10:03:15+05:30 IST