Bule Tick: వీరి ట్విట్టర్ బ్లూటిక్‌ లెగసీని పునరుద్ధరించిన ఎలాన్ మస్క్.. వారెవరంటే..?

ABN , First Publish Date - 2023-04-23T18:34:15+05:30 IST

అయితే తాజాగా ఎలాన్ మస్క్ మనసు మార్చుకున్నట్లున్నాడు. ట్విట్లర్‌లో ఇంకా బ్లూక్ టిక్ సభ్యత్వం పొందని వినియోగదారులకు..

Bule Tick: వీరి ట్విట్టర్ బ్లూటిక్‌ లెగసీని పునరుద్ధరించిన ఎలాన్ మస్క్.. వారెవరంటే..?

గత కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) బ్లూ టిక్ లెగసీని తొలగించిన విషయం తెలిసిందే. బ్లూటిక్ సబ్ స్కిప్షన్ సర్వీస్ ప్రారంభించిన తర్వాత సభ్యత్వం పొందిన వినియోగదారులకు మాత్రమే వారి పేరు ముందు బ్లూటిక్‌ను యాక్టవేట్ చేశారు. ఏప్రిల్ 20 తర్వాత సభ్యత్వం చెల్లించని ఎందరో ప్రముఖులు ట్విట్టర్ బ్లూటిక్‌ను కోల్పోయారు. అయితే తాజాగా ఎలాన్ మస్క్ మనసు మార్చుకున్నట్లున్నాడు. ట్విట్లర్‌లో ఇంకా బ్లూక్ టిక్ సభ్యత్వం పొందని వినియోగదారులకు కొంత మినహాయింపు ఇచ్చారు. ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వినియోగదారుల బ్లూటిక్‌ బ్యాడ్జ్‌ని పునరుద్దరిస్తున్నట్లు తెలుస్తోంది.

మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ యూజర్లు శుక్రవారం తమ బ్లూటిక్ యాక్టివేట్‌లో ఉన్నట్లు గుర్తించారు. కనీసం ఒక మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను కలిగి ఉన్న వినియోగదారుల ఖాతాల్లో వారి పేరు ముందు బ్లూటిక్ తిరిగి దర్శనమిచ్చింది. కొత్త అప్‌డేట్ కారణంగా బ్లూ టిక్‌లను కోల్పోయిన ప్రముఖ బాలీవుడ్ నటులు అలియాభట్, షారూఖ్‌ఖాన్, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్‌ధోనీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్, బిలియనీర్ బిల్‌గేట్స్ వారి ప్రొఫైల్‌లో బ్లూ చెక్‌మార్క్ తిరిగి వచ్చింది. అయితే వారు ధృవీకరణ కోసం చెల్లించారా లేదా అనేది స్పష్టంగా రాలేదు.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విషయాన్ని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘నేనైతే Twitter బ్లూటిక్ కోసం ఎలాంటి సబ్ స్క్రిప్షన్ తీసుకోలేదు.. Mr మస్క్ మీరు నా కోసం కూడా చెల్లించారా’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే చనిపోయిన సెలబ్రిటీలు, ప్రముఖుల ట్విట్లర్ ఖాతాలకు బ్లూటిక్ యాక్టివేట్ చేయబడ్డాయి. వారు సబ్‌స్కిప్షన్ చెల్లించి, వారి ఫోన్ నెంబర్లను వెరిఫై చేసుకున్నట్లు కనిపిస్తుంది. భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఇర్ఫాన్, రిషి కపూర్, గాయకుడు మైఖేల్ జాక్సన్, బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, క్రికెటర్ షేన్ వార్న్ వంటి ప్రముఖుల ట్విట్టర్ బ్లూటిక్ యాక్టివేట్‌లో ఉంది.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డెర్సీ 6.5 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నప్పటికీ అతని ఖాతా బ్లూక్ టిక్ ఇంకా పునరుద్దరించబడలేదు.

అంతకుముందు ట్విట్టర్ CEO ఎలోన్ మస్క్ కొంతమంది సెలబ్రిటీల ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ తాను వ్యక్తిగతంగా చెల్లిస్తున్నాను" అని పేర్కొన్నాడు. వీరిలో బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్, స్టార్ ట్రెక్ స్టార్ విలియం షాట్నర్, రచయిత స్టీఫెన్ కింగ్ ఉన్నారు. అయితే తాము బ్లూటిక్ కోసం ఎటువంటి చేయమని బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఇది జరిగింది.

Updated Date - 2023-04-23T19:10:17+05:30 IST