Twitter Blue Tick: ట్విట్టర్ ‘బ్లూటిక్' కోల్పోయిన సెలబ్రిటీలు.. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ సహా ఎవరెవరున్నారంటే..

ABN , First Publish Date - 2023-04-21T12:36:05+05:30 IST

బ్లూటిక్ సభ్యత్వం పొందని వినియోగదారులందరికీ Twitter లెగసీ “బ్లూ టిక్” ధృవీకరణ బ్యాడ్జ్‌ను గురువారం తొలగించింది. బ్లూటిక్ యాక్టివేట్ చేసుకునేందుకు భారతదేశంలో వెబ్‌లో నెలకు రూ.650, మొబైల్ యాప్‌లో..

Twitter Blue Tick: ట్విట్టర్ ‘బ్లూటిక్' కోల్పోయిన సెలబ్రిటీలు.. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ సహా ఎవరెవరున్నారంటే..

ఎలాన్ మస్క్(Elon Musk) హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ట్విట్టర్‌‌లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల ట్విట్టర్ బ్లూటిక్(Blue tick) పొందాలంటే సబ్ ‌స్క్రిప్షన్(Subscription) తీసుకోవాల్సిందేనని ఎలాన్ మస్క్ నిబంధనలు తెచ్చాడు. సబ్ స్క్రిప్షన్ చెల్లించకపోవడంతో తాజాగా భారతదేశంలో సినీ, రాజకీయ, పలు సంస్థలకు చెందిన ప్రముఖులు ట్విట్టర్ బ్లూటిక్‌ను కోల్పోయారు.

ట్విట్టర్‌లో బ్లూటిక్ బ్యాడ్జ్ కోల్పోయిన వారిలో రాజకీయ ప్రముఖులు మమతా బెనర్జీ(Mamata Banerjee), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు తమ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్‌ను కోల్పోయాయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా తమ ట్విట్లర్ బ్లూమార్క్ టిక్ బ్యాడ్జ్ కోల్పోయారు. సినీ రంగానికి చెందిన అమితాబ్ బచన్(Amitabh Bachchan), షారూక్ ఖాన్(Shah Rukh Khan) ఉన్నారు. ఇక ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా తమ ట్విట్టర్ బ్లూక్‌ను కోల్పోయారు.

కాగా బ్లూటిక్ సభ్యత్వం పొందని వినియోగదారులందరికీ Twitter లెగసీ “బ్లూ టిక్” ధృవీకరణ బ్యాడ్జ్‌ను గురువారం తొలగించింది. బ్లూటిక్ యాక్టివేట్ చేసుకునేందుకు భారతదేశంలో వెబ్‌లో నెలకు రూ.650, మొబైల్ యాప్‌లో అయితే రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాన్ మస్క్ ట్విట్లర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ట్విట్టర్ యూజర్లందరూ కొంత రుసుము చెల్లించి బ్లూటిక్ పొందాలని నిబంధనలు పెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ పార్టీలు కూడా తమ ట్విట్టర్ బ్లూటిక్‌ను కోల్పోయాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా వాటి ధృవీకరణ బ్యాడ్జ్‌లను కోల్పోయాయి.

కాగా ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ చెల్లించకపోవడంతో పోప్ ఫ్రాన్సిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తమ ట్విట్టర్ బ్లూటిక్‌ కోల్పోయారు.

ఎలోన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ బ్లూ చెక్‌మార్క్‌లతో వినియోగదారులను ధృవీకరించే విధానంలో గణనీయంగా మార్పులు వచ్చాయి. బ్లూటిక్ పొందాలంటే తప్పనిసరిగా సభ్యత్వం పొందాల్సిందేనని నిబంధన తెచ్చారు. అయితే అంతకుముందు ఈ బ్లూటిక్ బ్యాడ్జ్‌లను10 ఉన్నతస్థాయి వ్యక్తులు, పాత్రికేయులు, కార్యనిర్వాహకులు, రాజకీయ నాయకులు, సంస్థలకు వారి గుర్తింపులను ధృవీకరించిన తర్వాత గౌరవప్రదంగా ఇచ్చేవారు. కాగా బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్‌ పొందాలంటే గడువును గురువారం వరకు పొడిగించారు.

ఇప్పటివరకు Twitter వినియోగదారులలో దాదాపు 1 శాతం మంది మాత్రమే “Twitter Blue”కి సభ్యత్వాన్ని పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ధృవీకరించబడని వినియోగదారులు చెల్లింపుల ద్వారా సబ్ స్క్రిప్షన్ పొందాలని ట్విట్టర్ గురువారం పాప్ అప్ మేజేజ్‌లు పంపింది.

Updated Date - 2023-04-21T14:51:07+05:30 IST