Train extension: హుబ్లీ - తంజావూరు రైలు 2 నెలల పొడిగింపు
ABN , First Publish Date - 2023-07-20T11:55:38+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ(Hubli) నుంచి సేలం, కరూర్, తిరుచ్చి మీదుగా తంజావూరు(Thanjavur) వరకు నడిచే ప్రత్యేక రైలు(
అడయార్(చెన్నై): కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ(Hubli) నుంచి సేలం, కరూర్, తిరుచ్చి మీదుగా తంజావూరు(Thanjavur) వరకు నడిచే ప్రత్యేక రైలు(నెం.07325, 26)ను మరో రెండు నెలల పాటు దక్షిణ రైల్వే పొడిగించింది. ప్రయాణికుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ రైలును వారంలో ఒక రోజు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబరు 25వ తేదీ వరకు ప్రతి సోమవారం నడిపేలా పొడిగించారు. హుబ్లీలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరే ఈ రైలు... తంజావూరుకు మరుసటిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం రాత్రి 7.40 గంటలకు తంజావూరులో బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందని దక్షిణ రైల్వే విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.