Karnataka Election Result: బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు...144 సెక్షన్ విధింపు

ABN , First Publish Date - 2023-05-13T07:29:49+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బెంగళూరు నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు...

Karnataka Election Result: బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు...144 సెక్షన్ విధింపు
Traffic restrictions in Bengaluru

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా బెంగళూరు నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.(Karnataka Election Result 2023)కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయడంతో పాటు ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు(Bengaluru) నగరంలో 144 సెక్షన్(Section 144 imposed) విధించారు.కౌంటింగ్ కేంద్రాల చుట్టూ వాహనాల పార్కింగ్ చేయకుండా నిషేధం విధించారు.(Traffic restrictions)

కౌంటింగ్ జరుగుతున్న సెయింట్ జోసెఫ్ ఇండియన్ హైస్కూల్, పీయూ కళాశాల, మౌంట్ కార్మెల్ కాలేజీ, బసవన్న గుడి నేషనల్ కాలేజ్ ఆకాష్ ఇంటర్నేషనల్ స్కూలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. మే13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు.

Updated Date - 2023-05-13T07:29:56+05:30 IST