Share News

Visa: భారతీయులు ఆ దేశానికి ఇకపై వీసా లేకుండా వెళ్లొచ్చు.. కానీ...

ABN , First Publish Date - 2023-11-27T10:08:27+05:30 IST

వీసా(Visa)ల జారీ విషయంలో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్(India) నుంచి తమ దేశానికి వచ్చే వారికి వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.

Visa: భారతీయులు ఆ దేశానికి ఇకపై వీసా లేకుండా వెళ్లొచ్చు.. కానీ...

ఢిల్లీ: వీసా(Visa)ల జారీ విషయంలో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్(India) నుంచి తమ దేశానికి వచ్చే వారికి వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. మలేసియా(malaysia)కి చైనా నాలుగో, భారత్ ఐదవ పెద్ద మార్కెట్లుగా ఉన్నాయి.

ఆ దేశంలో పర్యాటక రంగాన్ని పెంచడానికి.. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి తీసుకున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 30 వరకు మాత్రమే వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్లు ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు.

ఈ నిబంధన చైనీయులకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది జనవరి, జూన్ మధ్య మలేసియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు. చైనా నుండి 4,98,540, భారత్ నుంచి 2,83,885 మంది పర్యాటకులు(Tourists) ఆ దేశాన్ని సందర్శించారు.

ప్రస్తుతం, మలేసియాలోకి ప్రవేశించడానికి చైనా, భారతీయ పౌరులు తప్పనిసరిగా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన నిబంధన ఉంది. త్వరలో నిబంధనలు మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే థాయిలాండ్ కూడా వీసారహిత ప్రవేశాన్ని అనుమతిస్తోంది.

Updated Date - 2023-11-27T10:09:05+05:30 IST