Share News

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2023-12-01T10:58:33+05:30 IST

సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు.

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

కశ్మీర్: సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రదాడుల సమాచారం నేపథ్యంలో భద్రతా దళాలు జమ్ము కశ్మీర్(Jammu Kashmir) పుల్వామా(Pulwama) జిల్లా అరిహాల్ ప్రాంతంలోని న్యూకాలనీలో గురువారం భద్రతా దళ అధికారులు మిలిటెన్సీ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారు.

ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని గుర్తించి అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాది ఏ సమూహానికి చెందినవాడో ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు.

Updated Date - 2023-12-01T10:58:34+05:30 IST