Delhi: ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-10-02T13:21:22+05:30 IST

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదిని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.

Delhi: ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదిని ఇవాళ దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాది(Terrorist) మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతన్ని పట్టించిన వారికి రూ.3 లక్షల రివార్డును ఇస్తామని గతంలోనే ప్రకటించారు.


ఢిల్లీ(Delhi)లోని ఐఎస్‌ఐఎస్‌ మాడ్యూల్‌ నుంచి పక్కా సమాచారంతో రావడంతో అతన్ని పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేసి.. పకడ్బందీగా బంధించారు. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్ట్ ముఠా పథకం పన్నిందని పోలీసులు తెలిపారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్.. పుణె(Pune) ఐసిస్ మాడ్యూల్ కేసులో వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. ఢిల్లీలో నివసించే అతను గతంలో పుణె పోలీసుల కస్టడీ(Police Custody) నుండి తప్పించుకున్నాడు. అతనితో పాటు అరెస్టైన ఉగ్రవాద అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-10-02T13:23:08+05:30 IST