Special trains: 28న కన్నియాకుమారికి ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2023-04-26T11:12:33+05:30 IST

వేసవి రద్దీ దృష్ట్యా ఈ నెల 28న ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది.

Special trains: 28న కన్నియాకుమారికి ప్రత్యేక రైలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వేసవి రద్దీ దృష్ట్యా ఈ నెల 28న తాంబరం నుంచి కన్నియాకుమారి(Kanniyakumari)కి ప్రత్యేక రైలు (06051)ను నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. తాంబరంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరే ఈ రైలు మరునాడు ఉదయం 7.45 గంటల కు కన్నియాకుమారికి చేరుకుంటుంది. 14 స్లీపర్‌ క్లాస్‌, 2 జనరల్‌ సెంకడ్‌ క్లాస్‌, 2 జనరల్‌ సెంకడ్‌ క్లాస్‌ (దివ్యాం గుల కోసం) బోగీలున్న ఈ రైలు చెంగల్పట్టు, మేల్‌మరు వత్తూర్‌, విల్లుపురం, విరుదాచలం, అరియలూర్‌, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌, సాత్తూర్‌, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, నాగర్‌కోయిల్‌ స్టేషన్లలో ఆగుతుంది. బుధవా రం ఉదయం 8 గంటల నుంచి ఈ రైలు రిజర్వేషన్‌ ప్రారంభమవుతుంది.

తాంబరం - జోథ్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

తాంబరం - జోథ్‌పూర్‌(Tambaram - Jodhpur) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 27, మే 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలకు తాంబరంలో బయలు దేరే ప్రత్యేక రైలు (06055).. 3వ రోజు సాయంత్రం 5.20 గంటలకు జోథ్‌పూర్‌ చేరుకుంటుంది. అదే విధంగా ఈ నెల 30, మే 7 తేదీల్లో సాయంత్రం 5.20 గంటలకు జోథ్‌ పూర్‌లో బయలుదేరే ప్రత్యేక రైలు (06056).. మూడో రోజు సాయంత్రం 7.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది. 1 ఏసీ టూ టైర్‌, 8 ఏసీ త్రీ టైర్‌, 5 స్లీపర్‌ క్లాస్‌, 6 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 1 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ (దివ్యాంగుల కోసం), 1 లగేజీ కం బ్రేక్‌ వ్యాన్‌తో కూడిన ఈ రైళ్లు ఎగ్మూర్‌, పెరంబూర్‌, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్‌, షోరనూర్‌, కోళికోడ్‌, కన్నూర్‌, కసరగాడ్‌, మంగళూరు, తోకూర్‌, ఉడిపి, కార్వార్‌, మడగావ్‌, రత్నగిరి, చిప్లన్‌, రోహా, పన్వల్‌, కామన్‌రోడ్‌, వాసల్‌రోడ్‌, వాపి, వల్సడ్‌, సూరత్‌, వడోదర, ఆనంద్‌, గెరట్‌పూర్‌, అహ్మదా బాద్‌, మెహసన, పటన్‌, భిల్డి, రాణివారా, మెర్వార్‌ భిన్మల్‌, మోడ్రాన్‌, జోలార్‌, మోకల్సర్‌, సందారి, లుని స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - 2023-04-26T11:12:33+05:30 IST