Special train: ఆ రోజుల్లో తిరువణ్ణామలైకి ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2023-06-08T10:57:15+05:30 IST

తిరువణ్ణామలై(Tiruvannamalai) క్షేత్రానికి చెన్నై, మైలాడుదురైల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. శివపార్వతులు

Special train: ఆ రోజుల్లో తిరువణ్ణామలైకి ప్రత్యేక రైలు

ప్యారీస్‌(చెన్నై): గిరిప్రదక్షిణ రోజుల్లో తిరువణ్ణామలై(Tiruvannamalai) క్షేత్రానికి చెన్నై, మైలాడుదురైల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. శివపార్వతులు కొలువుదీరిన తిరువణ్ణామలై క్షేత్రంలో ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో సుమారు 5 లక్షల మందికి పైగా రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ భక్తుల సౌకర్యార్థం చెన్నై, మదురై, కోయంబత్తూర్‌(Chennai, Madurai, Coimbatore) సహా ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని కోరుతూ దక్షిణ రైల్వేకు పలువురు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన దక్షిణ రైల్వే పౌర్ణమి రోజుల్లో మాత్రం చెన్నై బీచ్‌, తాంబరం, మైలాగుదురై ప్రాంతాల నుంచి జూలై నుంచి డిసెంబరు వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-06-08T10:57:15+05:30 IST