Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

ABN , First Publish Date - 2023-07-12T17:41:05+05:30 IST

శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బంగ్లాలో ఒక పాము (Snake) బుధవారం ఉదయం హల్‌చల్ చేసింది. ఆ సమయంలో ఆయన ప్రెస్ మీట్‌లో ఉన్నారు. పాముల పట్టే యువకుడిని సకాలంలో అక్కడకు రప్పించడంతో అతను పాము తోకపట్టుకుని తెలివిగా తనవెంట ఉన్న బ్యాగులోకి జారవిడిచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు.

Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

ముంబై: శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) బంగ్లాలో ఒక పాము (Snake) బుధవారం ఉదయం హల్‌చల్ చేసింది. దీంతో ఆ సమయంలో అక్కడున్న వారంతా బెంబేలెత్తారు. పాముల పట్టే యువకుడిని సకాలంలో అక్కడకు రప్పించడంతో అతను పాము తోకపట్టుకుని తెలివిగా తనవెంట ఉన్న బ్యాగులోకి జారవిడిచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. దీంతో అంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, పాము సంజయ్ రౌత్ ఇంట్లోకి వచ్చిన సమయంలో ఆయన పత్రికా సమావేశంలో ఉన్నారు. సహజంగా ఆయన రోజూ ఉదయం ప్రెస్‌మీట్ జరుపుతుంటారు. ఆ ప్రకారమే ఇవాళ కూడా ఆయన మీడియాతో ముచ్చటిస్తుండగా పాము ఆయన కుర్చీకి సమీపంలో కనిపించినట్టు చెబుతున్నారు. ఇది గమనించిన కొందరు సకాలంలో పాములు పట్టే కుర్రాడిని రప్పించారు. అతను పాముకు ఎలాంటి హానీ చేయకుండా దానిని తెలివిగా ఒడిసి పట్టుకుని తనవెంట తెచ్చుకున్న బ్యాగులోకి చేర్చడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది విషపు నాగు కాదని, అంతగా ప్రమాదం లేని పాముజాతికి చెందినదని చెబుతున్నారు.

Updated Date - 2023-07-12T17:41:05+05:30 IST