Syria: సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి...సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి

ABN , First Publish Date - 2023-04-18T08:15:44+05:30 IST

సిరియా దేశంలో అమెరికా హెలికాప్టరు దాడిలో సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి చెందారు....

Syria: సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి...సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి
US helicopter raid in Syria

వాషింగ్టన్ : సిరియా దేశంలో అమెరికా హెలికాప్టరు దాడిలో సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి చెందారు.(Senior Islamic State leader killed) సీనియర్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబ్ద్ అల్ హదీ మహమూద్ అల్ హాజీ అలీ యూరప్, మధ్యప్రాచ్యంలో దాడులకు ప్రణాళిక పన్నినట్లు అమెరికా వెల్లడించింది. సోమవారం అబ్ద్ అల్ హదీ మహమూద్ అల్ హాజీ అలీని లక్ష్యంగా చేసుకుని తాము హెలికాప్టరుతో దాడి చేశామని(US helicopter raid in Syria) పెంటగాన్ తెలిపింది. ఈ దాడిలో అబ్ద్ అల్ హదీ మహమూద్ అల్ హాజీ అలీ హతం అయ్యాడు.

విదేశాల్లోని అధికారులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ లీడర్ పన్నాగం పన్నుతున్నట్లు తమ నిఘావర్గాలకు సమాచారం అందిన తర్వాత హెలికాప్టర్ దాడి ప్రారంభించామని అమెరికా ఓ ప్రకటనలో పేర్కొంది.ఈ దాడిలో మరో ఇద్దరు సాయుధ వ్యక్తులు మరణించారని, పౌరులకు ఎటువంటి హాని జరగలేదని పేర్కొంది.రెండు వారాల క్రితం యూఎస్ దళాలు మరో సీనియర్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఖలీద్ అయద్ అహ్మద్ అల్ జబౌరీని హతమార్చాయి.

Updated Date - 2023-04-18T09:09:22+05:30 IST